శభాష్ పోలీస్ అన్న….
రైతులు హర్షం వ్యక్తం..,
ఖానాపురం జనం సాక్షి
మండల కేంద్రం నుండి రాగంపేట గ్రామానికి రైతు తన బైక్ పై పిండి బస్తాలు వేసుకుని వెళ్తుండగా రాగంపేట ఖానాపురం పోలీస్స్టేషన్ మార్గమధ్యంలో బస్తాలు కింద పడడంతో విధుల నిమిత్తం రాగం పేట గ్రామానికి వెళుతున్న పోలీసులు శ్రీనివాస్,లింగమూర్తి,సుమన్, గమనించి కిందపడ్డా బస్తాలను రైతు బైక్ పై కి చేర్చారు.దాంతో పలువురు రైతులు ప్రజలు శభాష్ పోలీస్ అన్న అంటూ సలాం చేశారు.