శభాష్‌ సిరిసిల్ల


` మందు బాటిళ్ళకి లొంగిపోము..
` నోట్ల కట్టలకి ఓట్లేయం..
` పనిమంతుడినే ఎన్నుకుంటాం..
` కేటీఆర్‌ సవాల్‌కు సిరిసిల్ల ఓటర్ల జవాబు
` మందు,డబ్బు లేకుండా ఓట్లేస్తామంటున్న నియోజకవర్గ ఓటర్లు
` ప్రజాస్వామ్యానికి కొత్త ఊపిరి.
` స్వాగతించిన 95 శాతం ప్రజలు..
` ‘జనంసాక్షి’సర్వేలో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర అంశాలు.
` ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే మంత్రి కేటీఆర్‌  ఆలోచన రాష్ట్రవ్యాప్తం ఆచరణలోకి రావాలని ఆశాభావం.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో  ఓ సమావేశంలో ఐటీ, మున్సిపల్‌, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తాను ఎప్పుడు ఓట్ల కోసం మద్యం డబ్బులు పంచలేదని  రాబోవు ఎన్నికల్లో ఓట్ల కోసం డబ్బు మద్యం పంచబోనని ప్రజలు కోరుకుంటే ఉంటానని లేకపోతే ఇంటికి పోతానంటూ ఉద్వేగ భరితంగా మాట్లాడిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడిన విషయం చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ విషయంలో సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రజలు ఏమనుకుంటున్నారనే  అంశంపై ‘‘జనంసాక్షి’’ విస్కృతంగా సర్వే నిర్వహించింది.

హైదరాబాద్‌(జనంసాక్షి):ప్రజాస్వామ్యానికి ఓటే ఊపిరి. ఏలాంటి ప్రలోభాలు లేకుండా సమాజాన్ని అభివృద్ధి పధం వైపు నడిపించేందుకు సమర్థవంతమైన నాయకులను ఎన్నుకునే అవకాశం కల్పించింది. ఎన్నికల రాజకీయాలలో రోజు రోజుకు వస్తున్న మార్పులు ఆందోళన కలిగించే స్థాయిలో ఉన్నాయి. మద్యం డబ్బులకు ఓటును తాకట్టు పెడుతున్న పరిస్థితి సమాజంలో పెరిగిపోయింది. ఈ సందర్భంలోనే మంత్రి కేటీఆర్‌ ప్రజలను ప్రలోభ పెట్టి పరిస్థితి పోవాలని ప్రజాస్వామ్య యుతమైన వాతావరణం రావాలని కోరుకుంటూ ఎన్నికల్లో డబ్బు మద్యం పంచబోనంటూ సవాలు విసిరారు. సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలయితే  సవాళ్లను స్వీకరిస్తూ స్వాగతిస్తున్నారు.

సిరిసిల్ల నియోజకవర్గం లోని అన్ని వర్గాల ప్రజల మనోభావాలను ‘జనంసాక్షి’’ సర్వే పరిగణలోకి తీసుకున్నది. సామాన్య ప్రజల అభిప్రాయాలను పట్టుకునే ప్రయత్నం చేసింది. మెజార్టీ ప్రజలు అసలు ఓటుకు నోటు డబ్బు ఇచ్చే పద్ధతికి స్వస్తి పలకాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సిరిసిల్లలో డబ్బు పంచిన మద్యం పోసిన ఓటు వేసే పరిస్థితి ఉండదని అభివృద్ధికే ఓటేస్తామని అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అయింది. సిరిసిల్ల నియోజకవర్గంలోని ప్రజలకు మంత్రి కేటీఆర్‌ అడక్కుండానే అభివృద్ధిని ప్రసాదించిన దేవుదంటు గుండెల్లో పెట్టి చూసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. డబ్బు మద్యం పంచకపోయిన మంత్రి కేటీఆర్‌ చేసిన స్వీకరిస్తూ అభివృద్ధి వైపే నిలబడతామంటూ 99 శాతం ప్రజలు స్పష్టం చేశారు.

మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు కొత్త ప్రజాస్వామికమైన ఆలోచనలు మొలకెత్తడానికి కారణమైనట్లు కనిపిస్తోంది. తమ ఓటును డబ్బుకు మద్యానికి అమ్ముకోబోమని డబ్బులు ఇచ్చిన తీసుకోమంటూ ప్రజలు అంటున్న పరిస్థితి సర్వేలో కనిపించింది. నిజానికి ఇవాళ ప్రజాస్వామ్యం బలోపేతం చేసేందుకు అభివృద్ధి కోసం పనిచేసే నాయకులని ఎన్నుకోవాలనే ప్రజలు భావించిన తీరు కొత్త చర్చలు లేవనెత్తుతున్నది. అత్యధిక శాతంగా ప్రజలు ఒక్క సిరిసిల్ల నియోజకవర్గం లోని కాకుండా రాష్ట్రవ్యాప్తంగా  ఓటు అమ్ముకునే పరిస్థితి కాకుండా ఎలాంటి ప్రలోభలోభాలకు లొంగకుండా రాష్ట్రవ్యాప్తంగా మంత్రి కేటీఆర్‌ సవాల్‌ ను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రజాస్వామ్యానికి కొత్త ఊపిరి పోయాలంటూ తమ అభిప్రాయాలను సర్వేలో వెల్లడిరచారు. రాష్ట్రవ్యాప్తంగా రానున్న ఎన్నికల్లో మంచి కేటీఆర్‌ చేసిన సవాల్‌ ప్రజల ఆలోచనలు మార్పు తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు దోహదం చేస్తుందని ఆశించవచ్చు.