శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకం

జగదేవ్ పూర్, అక్టోబర్ 22  (జనం సాక్షి):
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని జగదేవ్ పూర్ ఎస్సై కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా శనివారం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో విద్యార్థులకు పోలీసుల విధుల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  శాంతియుత వాతావరణం నెలకొల్పడంలో పోలీసులు  సమర్థవంతంగా విధులు నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో  సిబ్బంది యొక్క ఫంక్షనల్ వర్టికల్,  స్టేషన్ రైటర్ ,టెక్ టీమ్ బ్లూకోట్స్, కోర్టు డ్యూటీ , స్టేషన్ హౌస్ ఆఫీసర్  ,సెక్షన్ ఇన్ఛార్జ్, సమ్మాన్ & వారెంట్స్  ,పెట్రో కార్ ,కమాండ్ అండ్ కంట్రోల్ తదితర అంశాల  గురించి ఆయన విద్యార్థులకు వివరించారు.
Attachments area