శాంతియుతంగా ఉత్సవాలు జరుపుకోవాలి..
సిఐ నరేష్ కూమార్.
బేల, ఆగస్టు 30 ( జనం సాక్షి ) : గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని సిఐ నరేష్ కూమార్ అన్నారు.గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం మండల కేంద్రము లోని పోలిస్ స్టేషన్ లో అన్ని మతాల పెద్దలు, ప్రజా ప్రతినిధులు, ఉత్సవ కమిటీ సభ్యులతో శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా సిఐ నరేష్ కూమార్ మాట్లాడుతూ గణేష్ కమిటీ సభ్యులు అనుమతి కోసం ముందుగా అన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.మండపాల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.డిజేలకు ఎలాంటి అనుమతి లేదని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సై కృష్ణ కుమార్, రెవెన్యూ అధికారులు, ప్రజా ప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచ్లు ,గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు…