శాంతియుత వాతావరణం లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించాలి

 కామారెడ్డి డి.ఎస్.పి సోమనాథ్
జనంసాక్షి    రాజంపేట్
మండల కేంద్రంలో శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకోవాలని  కామారెడ్డి డిఎస్పి సోమనాథ్ అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం నిర్వహించిన  సమావేశంలో ఆయన మాట్లాడారు. గత సంవత్సరం వినాయక నిమజ్జనం వేడుకల్లో అల్లర్లను దృష్టిలో పెట్టుకొని యువకులందరూ జాగ్రత్తగా ఉండాలి ఆయన సూచించారు. ఈ సంవత్సరం ఎవరైనా అల్లర్లకు పాల్పడితే వారిపై కేసు నమోదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అనంతరం సిఐ తిరుపతి మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ  వినాయక మండపాలు రోడ్డుకు దూరంగా వేసుకోవాలని రోడ్లో వేస్తే వాహనాలకు ఇబ్బంది ఏర్పడుతుందని ఆయన సూచించారు. వినాయక నిమజ్జనం అయ్యేవరకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని  ఆయన తెలిపారు. ఎవరెవరు అల్లర్లకు పాల్పడతారో వారిని ముందస్తుగా బైండోవర్ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఎస్సై రాజు మాట్లాడుతూ… ఈసారి డీజే పర్మిషన్ లేదని ఎవరైనా డీజే యజమానులు డీజే పెడితే వారికి ఆరు నెలలు జైలు శిక్ష లేదా రెండు లక్షల జరిమానా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ సమావేశానికి స్థానిక ప్రజా ప్రతినిధులు ఉత్సవ కమిటీ సభ్యులు యువకులు వివిధ రాజకీయ పార్టీ నాయకులు హాజరయ్యారు