శాంతి భద్రతలను కాపాడటంలో ఎస్సై రవీందర్ ముందు చూపు
రుద్రూర్ (జనంసాక్షి)
రాబోవు బక్రీద్ పండుగా మరియు బోనాల పండుగ గూర్చి ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరుగకుండా
05.07.2022 రోజున రుద్రూర్ పోలీస్ స్టేషన్ నందు మండల శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు చేయనైనది . పండుగలను ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలందరూ సుఖ సంతోషలతో జరుపుకోవాలని , శాంతి భద్రతలకు భంగం కలిగించే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నియమ నిబంధనలు పాటించాలని, లేని యెడల చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని . గ్రామ మరియు మండల పెద్దల సమక్షంలో రుద్రూర్ ఎస్సై రవీందర్ తెలియజేశారు.
శాంతి భద్రతలను కాపాడటంలో ఎస్సై రవీందర్ ముందు చూపు పై మండల ప్రజలు ఆయనను అభినందించారు. ఈ కార్యక్రమానికి జడ్పీటీసీ, సర్పంచ్ మరియు మసీద్ కమిటీ పెద్దలు, అందరు పాల్గొన్నారు.రుద్రూర్ ఎస్సై రవిందర్, జడ్పీటీసీ నారోజి గంగారాం, గ్రామ సర్పంచ్ ఇందూర్ చంద్రశేఖర్, టిఆర్ఎస్ నాయకులు అక్కపల్లి నాగేందర్, మస్జీద్ కమిటీ అద్యక్షులు జహూర్ సహాబ్, కోశాధికారి యూనూస్ భాయ్, హిందు, ముస్లిం సోదరులు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాలుగొన్నారు