శాడిస్టు మొగుడు

– నపుంసకత్వాన్ని కప్పిపుచ్చుకొనేందుకు భార్యపై వేదింపులు
– భార్య నగ్నచిత్రాలను తీసి నెట్‌లో పెడతానని బెదిరింపులు
– వేదింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించిన భార్య
– కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
– పరారీలు రాజేందర్‌
కర్నూలు, సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి) : తన లోపాన్ని ఎవరికైనా చెబితే నగ్న చిత్రాలు బయటపెడతానని కట్టుకున్న భార్యను బెదిరించాడు ఓ సాఫ్ట్‌వేర్‌ శాడిస్ట్‌ భర్త. పెళ్లయిన దగ్గర నుంచి చిత్రహింసలకు గురిచేస్తూ వస్తున్నా.. మౌనంగా ఉండిపోయిన భార్య.. వేధింపులు తీవ్రంగా కావడంతో పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా రాయదుర్గంకు చెందిన యువతికి, హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మాచాని రాజేందప్రసాద్‌తో గత ఏడాది ఆగస్టు 2న వివాహం అయింది. కట్నంగా 45లక్షల రూపాయలు, వివాహనంతరం మరో 10 లక్షల రూపాయలను కూడా అప్పజెప్పారు. కాగా పెళ్లైన మొదటిరోజే రాజేందప్రసాద్‌ తేడాగా వ్యవహరించాడు. ఆమె నగ్న ఫోటోలు, వీడీయోలు తీశాడు. తాను నపుంసకుడినని, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే నగ్న ఫోటోలు, వీడియోలో సోషల్‌ విూడియాలో పోస్ట్‌ చేస్తానని బెదిరించాడు. దీంతో ఈ విషయాన్ని యువతి అతడి అమ్మమ్మకు చెబితే తన మనవడు నపుంసకుడేనని, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. దీంతో ఆ విషయాన్ని ఎవరి చెప్పుకోలేక కుంగిపోయానంటూ బాధితురాలు విూడియా ముందు అత్తింటి వారి ఆగడాలు భరించలేక వచ్చినట్లు బాధితురాలు పేర్కొన్నారు.  ఆసుపత్రికి వెళ్లి అన్ని రకాల పరీక్షలు చేయించుకున్నానని, నాకు ఏ రోగం లేదని డాక్టర్లే నిర్ధారించారన్నారు. నా భర్తకు పరీక్షలు చేయించమని అత్తింటివారిని అడగ్గా.. అతడు ఎక్కడి రాడు. ఏం చేసుకుంటావో చేసుకోపో అని బెదిరించారని ఆవేదన వ్యక్తంచేసింది. అమ్మనాన్నలకు చెప్పి పెద్దల సమక్షంలో నిలదీస్తే ఏమి స్పందించకుండా వెళ్లిపోయాడని తెలిపింది. రాజేందప్రసాద్‌ మరో పెళ్లికి రెడీ అయ్యారని బాధితురాలు పేర్కొంది. తనకు జరిగిన అన్యాయం మరో అమ్మాయికి జరగకూడదనే పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితురాలు పేర్కొన్నారు. ఇలాంటి వాళ్లను వద్దలొద్దు అంటూ విూడియా ముందు కన్నీరుమున్నీరయ్యారు. అతడికి శిక్ష పడిన తర్వాతే తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తానని చెప్పారు.
సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం అని పెళ్లి చేశాం – బాధితురాలి తండ్రి
మంచి సంబంధం, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగమని తమ కూతురుకి డిగ్రీ సెకండియర్‌లోనే వివాహం చేశామని బాధితురాలి తండ్రి తెలిపారు. 45లక్షలు కట్నంగా, మరో 10లక్షలు అదనంగా ఇచ్చామన్నారు. కానీ అబ్బాయి ఇలాంటివాడు అనుకోలేదని విూడియా ముందు వాపోయారు. ఈ విషయంపై మాట్లాడేందుకు వారి ఇంటికెళ్లిన తమ తమ్ముడిని తీవ్రంగా కొట్టారని పేర్కొన్నారు. దీంతో విధిలేక పోలీసులను ఆశ్రయించామన్నారు. తన కూతురి జీవితాన్ని నాశనం చేసిన రాజేందప్రసాద్‌కు కఠిన శిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

తాజావార్తలు