శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకునే దిశగా ఆలోచన చేస్తున్నాం-కలెక్టర్ అనురాగ జయంతి.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. జులై 28. (జనంసాక్షి). సిరిసిల్ల పట్టణంలోకి వరద నీరు రాకుండా మానేరు వాగులో కలిసేలా చూడడం కోసం తగిన ఆలోచన చేస్తున్నామని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. శనివారం సిరిసిల్ల కొత్తచెరువు మత్తడి ప్రాంతాన్ని కలెక్టర్ అనురాగ్ జయంతి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎగువ ప్రాంతాల నుండి వచ్చే వర్షపు నీటిని పట్టణంలోకి రాకుండా మానేరు వాగులోకి దారి మళ్లించే దిశగా ఆలోచన చేస్తున్నామని తెలిపారు. సిరిసిల్ల పట్టణం శివారు ప్రాంతంలోని ఈదుల చెరువును, చిన్న బోనాలలో గండి పడిన పెద్ద చెరువును పరిశీలించారు. చెరువుకు మరమత్తులు చేసి గేట్లు బిగించాలని ఆదేశించారు. ఆపద సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండే సేవలు అందించిన అధికారులను మీడియా మిత్రులను అభినందించారు. కార్యక్రమంలో ఆర్డిఓ ఆనంద్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, జిల్లా ఇరిగేషన్ అధికారి గంగం శ్రీనివాసరెడ్డి, తాసిల్దార్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.