శాస్త్రీయంగా కొత్త జిల్లాలు

4

కడియం శ్రీహరి

మాపై కోసం ప్రజలపై చూపొదు:డి.కె .అరుణ

హైదరాబాద్‌, ఆగస్టు 14 (జనంసాక్షి)

శాస్త్రీయంగా జిల్లాల ఏర్పాటు: కడియం కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ప్రభుత్వం కస రత్తు ముమ్మరం చేస్తోంది. ఈ మేరకు పలు జిల్లాల ప్రజా ప్రతినిధుల నుంచి ప్రతిపా దనలు స్వీకరిస్తోంది. ఆదివారం మర్రి చె న్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో కేబినెట్‌ సబ్‌ కమిటీతో ప్రజా ప్రతినిధులు సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ.. జిల్లాల ఏర్పాటు ప్రక్రియ శాస్త్రీయంగానే కొనసాగు తోందన్నారు. పది జిల్లాల ప్రజా ప్రతినిధుల నుంచి అనేక ప్రతిపాదనలు వచ్చాయన్నారు. వాటినన్నింటిని పరిశీలిస్తామని, అన్ని ప్రతిపాదనలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసు కెళ్తామన్నారు. త్వరలో జిల్లా కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని జిల్లాల్లో జనాభా సమానంగా ఉండే అవ కాశం లేదన్నారు. ఈ సమావేశంలో మహ బూబ్‌నగర్‌ జిల్లా పునర్‌వ్యవస్థీకరణపై భూప రిపాలనా శాఖ ప్రధాన కమిషనర్‌య రేమం డ్‌ పీటర్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. కొత్తగా నాగర్‌కర్నూలు, వనపర్తి జిల్లాలను ప్రతిపాది స్తున్నట్లు తెలిపారు. దీనిపై జిల్లా నేతల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. అన్ని వనరులు ఉన్న గద్వాల కేంద్రంగా జోగు లాంబ జిల్లా ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ డి మాండ్‌ చేశారు. మహబూబ్‌నగర్‌ ఎంపీ జితేందర్‌ రెడ్డి,అలంపూర్‌ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌, జడ్పీ ఛైర్మన్‌ భాస్కర్‌ కూడా గద్వాల కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. నారాయణపేట జిల్లా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే రాజేందర్‌ రెడ్డితో పాటె ఎమ్మెల్సీ రామచంద్రరావు కోరారు. కల్వకుర్తి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వంశీచంద్‌ రెడ్డి, వనపర్తి ప్రతిపాదన కొనసాగించాలని మాజీ మంత్రి చిన్నారెడ్డి, షాద్‌నగర్‌ జిల్లా ఏర్పాటు చేయాలని కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి కోరారు. హైదరాబాద్‌: కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వానికి సరైన అవగాహన లేదని, సమావేశాలు తూతూమంత్రంగా నిర్వహిస్తే తెలంగాణ ప్రజలను అవమానించినట్లేనని, తన పైన ఉన్న కోపాన్ని తన నియోజకవర్గ ప్రజల పైన చూపవద్దని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తెలంగాణ టిడిపి నేత రేవంత్‌ రెడ్డి ఆదివారం నాడు హితవు పలికారు. ప్రజా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కేబినెట్‌ సబ్‌ కమిటీ సభ్యులు, అధికారులు సరైన సమాధానం చెప్పడం లేదన్నారు. రాజకీయ లబ్ధి కోసమే జిల్లాల విభజన జరుగుతోందన్నారు. సీఎం కేసీఆర్‌ లక్కీ నెంబర్‌ 6 అని, అందుకే 24 జిల్లాలు (2+4 =6) చేస్తున్నారన్నారు. గద్వాల జిల్లా ప్రతిపదాన లేకపోవడంపై డీకే అరుణ కూడా మండిపడ్డారు.