శేఖాపూర్ గ్రామంలో…. ఒకే ఇంట్లో ముగ్గురికి పోలీస్ కొలువులు
శేఖాపూర్ గ్రామంలో…. ఒకే ఇంట్లో ముగ్గురికి పోలీస్ కొలువులు
బిచ్కుంద మద్నూర్ అక్టోబర్ (జనంసాక్షి)
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని మద్నూర్ మండలం శేఖాపూర్ గ్రామంలో ఒకే ఇంట్లో ముగ్గురు అభ్యర్థులు పోలీసు శాఖలో కొలువులు సాధించారు. వివరాల్లోకి వెళితే ఈ గ్రామానికి చెందిన సక్పాల్ సురేష్ మరియు అనితవకు ముగ్గురు సంతానం సతీష్, సచిన్, నితిన్. కాగా తల్లిదండ్రులు ఆర్థికంగా పేదరికంలో ఉన్నాకానీ తన పిల్లల ఉన్నత భవిషత్తు కోసం చక్కటి ప్రణాళికతో వారి చదువులకై ప్రోత్సహించడంతో పాటు ధైర్యంతో పేదరికాన్ని జయించి, పిల్లలు కూడా మట్టిలో మాణిక్యము లాగా బాగా ఇష్టపడి, కష్టపడి ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పోలీసు శాఖలో సివిల్, ఎఆర్, బెటాలియన్ విభాగాలలో ఎంపికై ఈ తరం యువతకు ఆదర్శంగా నిలిచారు. అభ్యర్థులకు వాళ్ల తలిదండ్రులకు గ్రామస్తులు, మండల ప్రజలు, బందుమిత్రులు డాక్టర్ దేవిదాస్ సక్పాల్, పండరి సక్పాల్, కాటమోడే ఆకాష్, సంజీవ్, గౌతమ్ తదితరులు అభినందిచారు.