శేషాచలం ఎన్ కౌంటర్ పై హైకోర్టులో విచారణ

హైదరాబాద్: చిత్తూరు జిల్లాలో జరిగిన శేషాచలం ఎన్ కౌంటర్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎపి ప్రభుత్వం కేసు డైరీని కోర్టుకు సమర్పించింది. కేసు డైరీపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం నియమించిన సిట్ ను కోర్టు తన ఆధీనంలోకి తీసుకుంది. రెండు నెలల్లో దర్యాప్తు చేసి… నివేదిక ఇవ్వాలని సిట్ ను ఆదేశించింది.