శ్రీకాకుళంలో రాష్ట్రస్థాయి చెస్ పోటీలు
శ్రీకాకుళం,జూలై10(జనం సాక్షి): ఈ నెల 28, 29 తేదీల్లో డాక్టర్ చౌదరి సత్యనారాయణ మెమోరియల్ రాష్ట్ర స్థాయి ఒపెన్ చెస్ పోటీలను నిర్వహించనున్నట్లు జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు సనపల భీమారావు ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్ర స్థాయి పోటీల్లో 13 జిల్లాలు నుంచి 250 మంది క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. వీరిలో 70 మంది రేటెడ్ క్రీడాకారులు పాల్గొనున్నారని తెలిపారు. వీరందరికీ వసతి, భోజన సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్తికేయ స్పోర్ట్స్ అకాడవిూ ఆధ్వర్యంలో జిల్లా రైస్ మిల్లర్లు సంఘం భవనంలో నిర్వహిస్తున్న పోటీలను ఎపి చెస్ అసోసియేషన్ పర్యవేక్షిస్తుందన్నారు. చౌదరి సత్యనారాయణ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా వారి కటుంబ సభ్యులు ఆర్థిక సహాయంతో పోటీలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పోటీల్లో గెలుపొందేవారికి రూ.35 వేలు నగదు బహుమతితో పాటు, జ్ఞాపికను అందజేస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వయసుతో నిమిత్తం లేకుండా క్రీడల్లో ఎవరైనా పాల్గోవచ్చని తెలిపారు. ఈ నెల 25లోగా 9912559735 నెంబర్‌కు సంప్రదించాలని కోరారు. పోటీలకు చీఫ్ ఆర్బిటర్‌గా విశాఖపట్నానికి చెందిన బి.రమేష్ వ్యవహరిస్తారన్నారు.