శ్రీరాంసాగర్‌కు కొనసాగుతున్న వరద
నిజామాబాద్,జూలై9( జనంసాక్షి): ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.జిల్లాలోని శ్రీరాం సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టులోకి గంట గంటకు ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్టు ఇన్‌ఎª`లో 35,266 క్యూసెక్కులు కాగా, ఔట్ ఎª`లో 788 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం ప్రస్తుత నీటిమట్టం 1,073 అడుగులు కాగా, పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు. ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ 31.849 టీఎంసీలు. నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు. జూన్ 1 నుంచి ప్రాజెక్టులోకి 17.782 టీఎంసీల నీరు వచ్చి చేరింది.
భీంగల్ మండలం కప్పలవాగు చెక్‌డ్యామ్ పైనుంచి వర్షపు నీరు పారుతోంది. నవీపేట మండలం జన్నపల్లిలో పెద్ద చెరువు అలుగు పారుతోంది. లింగాపూర్ శివారులో వరద ధాటికి తుంగినిమాటు కాలువకు గండి పడిరది. దీంతో వందల ఎకరాల్లో వరి పంట నీటమునిగింది. తీగలవాగు ఉప్పొంగడంతో ఏర్గట్ల ? మెట్‌పల్లి మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. వర్షాల ఇబ్బందుల పరిష్కారానికి 08462 ? 220183 నంబర్ కు ఫోన్ చేయొచ్చు. కామారెడ్డి జిల్లాలో సాధారణంతో పోలిస్తే 70 శాతం అధిక వర్షపాతం నమోదైంది.