శ్రీలంకలో మరోసారి ఉద్రిక్తత

నిరసనకారులపై సైన్యం దాడి
అధ్యక్షభవనం ముందు టెంట్లు తొలగింపు
ఆందోళనకారులపై విచక్షణారహితంగా లాఠీ
ఘటనపై మండిపడ్డ అమెరికా రాయబారి

కొలంబో,జూలై22(జనం సాక్షి :శ్రీలంకలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. కొలంబోలోని గాల్‌ ఫేస్‌ సైట్‌లో కొన్ని రోజులుగా టెంట్లు వేసుకుని నిరసనలు చేపడుతున్న ఆందోళనకారులపై పోలీసులు విరుచుకు పడ్డారు.ఆ ప్రాంతంలో నిరసనకారులు వేసిన టెంట్లను ఆర్మీ తొలగించింది. దీంతో నూతన అధ్యక్షుడు రణిల్‌ విక్రమ సింఘేకు వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. దీంతో ఉద్రికత్త పరిస్థితి ఏర్పడిరది.
నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలు రaుళిపించారు. పలువురు నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. జర్నలిస్టులపైనా పోలీసులు దాడి చేశారు. అతని
దగ్గర నుంచి మొబైల్‌, కెమెరాలను పోలీసులు లాక్కున్నారు. అందులో ఉన్న వీడియోలు వారు డిలీట్‌ చేశారు. వీటికి సంబంధించిన వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్‌ విక్రమ సింఘే ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోనే నిరసనకారులపై పోలీసులు, సైన్యం తీవ్రంగా విరుచుకు పడటం గమనార్హం. శ్రీలంక నూతన అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘేకు వ్యతిరేకంగా కొలంబోలోని ప్రెసిడెన్షియల్‌ సెక్రటేరియట్‌ ప్రాంగణం వెలుపల నిరసనకారులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. వీరిని నియంత్రించేందుకు భద్రతా దళాలు బారికేడ్లను ఏర్పాటు చేశాయి. దీంతో నిరసనకారులు, సైన్యం మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు తాము ఏర్పాటు చేసుకున్న శిబిరాన్ని రాత్రివేళలో సైన్యం తొలగించిందని నిరసనకారులు ఆరోపించారు. రణిల్‌ విక్రమసింఘే తమను నాశనం చేయాలనుకుంటున్నారని, కానీ తాము తమ నిరసనను విడిచిపెట్టబోమని చెప్పారు. ఇటువంటి దుష్ట రాజకీయాల నుంచి తమ దేశాన్ని విముక్తి చేస్తామని చెప్పారు. రణిల్‌ విక్రమసింఘే శ్రీలంక నూతన అధ్యక్షునిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూరియ ఆయన చేత పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేయించారు. పార్లమెంటులో బుధవారం జరిగిన ఎన్నికల్లో ఆయన గెలిచారు. నిరసనకారులపై శ్రీలంక భద్రతా దళాల చర్యలను ఆ దేశంలోని అమెరికన్‌ రాయబారి జూలీ చున్‌ తీవ్రంగా ఖండిరచారు. గల్లే ఫేస్‌లో నిరసనకారులపై గురు`శుక్రవారాల మధ్య రాత్రి సైన్యం విరుచుకుపడటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు సంయమనం పాటించాలని, గాయపడిన నిరసనకారులకు తక్షణం వైద్య చికిత్స అందజేయాలని కోరారు. జూలీ చున్‌ శుక్రవారం ఇచ్చిన ట్వీట్‌లో, గల్లే ఫేస్‌ వద్ద అర్ధరాత్రి నిరసనకారులపై చేపట్టిన చర్యలు తీవ్ర ఆందోళనకరమని తెలిపారు. అధికారులు సంయమనం పాటించాలని, గాయపడినవారికి తక్షణమే వైద్య చికిత్స చేయించాలని కోరారు.