శ్రీవారిని దర్శించుకున్న
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వివేక్
తిరుమల, జులై5(జనం సాక్షి) : తిరుమల శ్రీవారిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వివేక్, మాజీ ఎంపీ వినోద్ గురువారం దర్శించుకున్నారు. గురువారం ఉదయం నైవేద్య విరామసమయంలో వివేక్, వినోద్ సోదరులు కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెలించుకున్నారు. టీటీడీ ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వివేక్, వినోద్ దంపతులకు ఆలయ అర్చకులు వేదశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందచేసి పట్టువస్త్రంతో సత్కరించారు. కూతురు వైష్ణవి వివాహం తరువాత స్వామి వారి ఆశీర్వాదం కోసం తిరుమలకు వచ్చానని వివేక్ తెలిపారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు కార్యక్రమానికి ప్రజలనుంచి మంచి స్పందన వస్తుందని పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాలు బాగా అభివృద్ధి చెందాలని స్వామవారిని ప్రార్దించానని ఆయన తెలిపారు. ఇరు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హావిూలను నెరవేర్చాలని తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్రంపై ఒత్తిడి తెస్తుందని వివేక్ తెలిపారు.