శ్రీశైలానికి వరద తగ్గుముఖం

తుంగభద్కు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
కర్నూలు,అగస్టు7(జనంసాక్షి): శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుముఖం పడుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 58,629 క్యూసెక్కుల ఇన్‌ఎª`లో వస్తున్నది. ప్రస్తుతం రెండు గేట్లు పది అడుగులు ఎత్తి.. నీటిని దిగువకు వదులుతుండగా.. ఔట్‌ ప్లో 1,20,088 క్యూసెక్కులుగా ఉన్నది. డ్యామ్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.50 అడుగులుగా ఉన్నది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలకు గాను ఇప్పుడు 212.4385 టీఎంసీల నీరుంది. కుడి, ఎడమ జల విద్యుత్‌ కేంద్రాల్లో కొనసాగుతున్న విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతున్నది. అలాగే నాగార్జున సాగర్‌ డ్యామ్‌కు 66,057 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. అదేస్థాయిలో ఔట్‌ ఎª`లో ఉన్నది. గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 580.70 అడుగు లుంది. ప్రస్తుతం 311.1486 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‌ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. తుంగభద్ర ఇన్‌ ప్లో 60,604 క్యూసెక్కులు కాగా, ఔట్‌ ప్లో 58,864 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. తుంగభద్ర పూర్తిస్థాయి నీటిమట్టం 1,633 అడుగులు కాగా, ప్రస్తుతం 1,631 అడుగులుగా ఉంది. తుంగభద్ర పూర్తిస్థాయి నీటినిల్వ 100 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం 96.823 టీఎంసీలుగా ఉంది.