శ్రీశైలం గేట్లు మూసివేత

శ్రీశైలం,ఆగస్టు 21(జ‌నం సాక్షి): ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం గేట్లు మూసివేశారు. ఇప్టపి వరకు ఐదుగేట్లు తెరచి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేశారు. అయితే నీటి రాక ఆగడంతో గేట్లు మూసేసారు. జూరాల నుంచి 1,50,481 క్యూసెక్కులు, సుంకేశుల జలాశయం నుంచి 35,586 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి వస్తోంది. ఎగువ ప్రాంతాలైన హంద్రినీవాకి 2,363 క్యూసెక్కుల నీరు, కల్వకుర్తికి 2,400 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడుకు 26 వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. కుడిగట్టు జల విద్యుత్‌ కేంద్రం ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ 34,144 క్యూసెక్కులు, ఎడమ గట్టు జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 42,378 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుత నీటి మట్టం 882.40 అడుగులుకు చేరగా.. నీటి నిల్వ సామర్థ్యం 201.12 టీఎంసీలుగా నమోదైంది.

—-

 

తాజావార్తలు