శ్రీ రామసేన యూత్ నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో స్వచ్ఛత పక్షోత్సవాలు.

దుబ్బాక 07, ఆగష్టు ( జనం సాక్షి )
భారత ప్రభుత్వం,నెహ్రూ యువ కేంద్రం ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తేదీ నుండి ఆగస్టు 15 వరకు “స్వచ్ఛత పక్వాడ” కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది దానిలో భాగంగా ఆదివారం రోజు సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పెద్ద గుండవెల్లి గ్రామంలో స్వచ్ఛత ప్రతిజ్ఞతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.రామసేన యూత్ బాధ్యులు మేల్పుల రాజు తోడుకునూరి రాము మాట్లాడుతూ స్వచ్ఛత పక్షోత్సవాలు ఆగస్టు ఒకటో తేదీ ప్రతిజ్ఞతో ప్రారంభించి స్వచ్ఛత పైన 15 రోజులపాటు, ప్రభుత్వ కార్యాలయాలు, హాస్పిటళ్లు, గ్రామపంచాయతీ ,అంగన్వాడీ , పరిశుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని వారు తెలిపారు. అదేవిధంగా స్వచ్ఛత పైన డోర్ టు డోర్ క్యాంపెయిన్ ,వాల్ రైటింగ్ లు, పోస్టర్స్, పలు శుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తామని వారన్నారు. నెహ్రూ యువ కేంద్ర సహాయ అధికారి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఆజాధికా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా హార్ గర్ తిరంగా కార్యక్రమాన్ని 13 ,14, 15 తేదీలలో నిర్వహించాలని ప్రతి ఇంటి పైన జాతీయ జెండా ఎగరాలని వారు పిలుపునిచ్చారు. స్వచ్ఛభారత్ 100 గంటల పని కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తుందని ఈ కార్యక్రమాన్ని యువత వారి వారి గ్రామాల్లో ఒక గంట సేపు నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో యువజన సంఘ సభ్యులు బాయ్ కాడి లక్ష్మణ్, ప్రశాంత్ ,వంశీ,భాను,పోచయ్య నిఖిల్ ,లిట్టు తదితరులు పాల్గొన్నారు.