శ్రీ వెంకటేశ్వర ఆలయంలో విశేష పూజలు
వరంగల్ నగరంలోని బట్టల బజార్ లో గల శ్రీ బాల నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు శనివారం విశేష పూజలు నిర్వహించారు .పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా ఆలయంలో చిన్న జీయర్ స్వామి శిష్య బృందం ఆధ్వర్యంలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తుండగా నగరంతో పాటు నలుమూలల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రత్నాకర్ రెడ్డి, ఆలయ చైర్మన్ పరాశరన్ శ్రీనివాసాచార్యులు, శేషాచార్యులు, శ్రీధరాచార్యులు, రాఘవాచార్యులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు