షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్
సర్వసభ్యసమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి
నిజామాబాద్, జనవరి 31 (): నిజామాబాద్ షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సర్వసభ్యసమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని ఆ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ప్రవీణ్‌రెడ్డి, కోశాధికారి సురేష్‌కుమార్‌లు కోరారు. ఈ మేరకు గురువారం స్థానిక ప్రెస్‌క్ల బ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో మాట్లాడుతూ 2002 సంవ త్సరంలో ఎన్నుకోబడ్డ బ్యాడ్మింటన్ అసోసియేషన్‌కు ఇప్పటి వరకు ఎన్నికలు జరుపలేదని గత పదేళ్లుగా పాత కమిటీనే కొనసాగుతుందని వారు ఆరోపించారు. సర్వసభ్య సమావేశం జరుపాలని అధ్యక్ష, కార్యదర్శులకు కోరినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అసోసియేషన్‌కు ఎన్నికలు జరుపాలని ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ దృష్టికి తీసుకువచ్చిన వారి నుంచి కూడా సహకారం లభించ డంలేదన్నారు. జిల్లాలో ఈ అసోసి యేషన్ తరపున ఒక్క టోర్నమెంటును కూడా నిర్వహించిన దాఖలాలు లేవని, ఫలితంగా క్రీడాకారులు తమ ప్రతిభ ను కనబర్చలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్‌డిబిఎ అధ్యక్ష, కార్యదర్శుల నిర్లక్ష్యం, అలసత్వం కారణంగా షటీల్ ఇండోర్‌స్టేడియం ఉడెన్‌కోర్టు కోసం మంజూరయిన సుభాష్‌నగర్‌లోని జడ్పీగెస్ట్‌హౌస్ ముందు ఉన్న 2000వేల గజాల స్థలాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్ప డిందన్నారు. ఫిబ్రవరి 5వ తేదీలోగా ఎన్‌డిబిఎ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరుపాలని లిఖితపూర్వ కంగా కోరినట్లు వారు వివరించారు. గడువులోగా సమావేశం నిర్వహించక పోతే తమ పదవులకు రాజీనామా చేసి, తామే జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో సంయుక్త కార్యదర్శి ఎస్.మురళీధర్, సభ్యులు ఎ.శ్రీనివాస్, రత్నాకర్‌రెడ్డి, డాక్టర్లు కౌలయ్య, రాములు, రామ్‌చందర్ తదితరులు పాల్గొన్నారు.