షర్మిలమ్మ నీవు చేస్తుంది పాదయాత్ర కాదు అది ఫ్యాషన్ షో

జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్
 వనపర్తి: సెప్టెంబర్ 10 (జనం సాక్షి) మీ అయ్యా అక్రమంగా సంపాదించిన డబ్బులను ఎలా ఖర్చు చేయాలో తెలియక రోజు 14 లక్షల రూపాయలను ఖర్చు పెడుతూ హైటెక్ రాజకీయం చేస్తూ ప్రజాప్రస్థానం పేరుతో షర్మిలమ్మ నీవు చేస్తున్నది పాదయాత్రల లేదని ఫ్యాషన్ షో లో ఉందని ఊరు బయట వరకు వాహనాల్లో వచ్చి అక్కడి నుండి ఊర్లోకి పాదయాత్రగా వచ్చి ఊరు బయట రాగానే వాహనం ఎక్కి వెళ్లి షర్మిలమ్మ ఇది పాదయాత్ర అవుతుందా అని జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ విమర్శించారు . శనివారం జిల్లా టిఆర్ఎస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాంతీయ పార్టీ అని చెప్పుకుంటూ తిరుగుతున్న నీవు ఆంధ్రాలో మీ అన్న పాలన మంచిగా ఉందా లేదా సమస్యలు ఏమైనా ఉన్నాయా లేవా తెలుసుకోవాల్సింది పోయి జాతీయ పార్టీల తెలంగాణలో తిరుగుతూ రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బ తేనెల మాట్లాడుతున్నామని మొదటగా మీ అన్న తో లెక్కల పంచాయతీ తెంపుకొ అని షర్మిలమ్మని ఆయన తో పలికారు. తెలంగాణకు తీవ్ర నష్టం చేసింది ఆంధ్ర నాయకులని వైయస్సార్ చనిపోయి 13 ఏండ్లు అవుతున్న ఇంకా తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారని మరి చనిపోయారా లేదా అని వనపర్తి జిల్లా కేంద్రంలో అన్నావు కదా తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంటే మీ అయ్యా విగ్రహ ఏర్పాటుకు స్థలం ప్రజల స్వచ్ఛందంగా ఇచ్చేవారని మరి ఎనిమిది లక్షలు పెట్టి కొత్తకోటలో పెట్టేందుకు ఎందుకు స్థలంగా ఉన్నావమ్మా షర్మిలమ్మ కాస్త సమాధానం చెప్పమ్మా అని ఆయన విమర్శించారు.దోచుకుని జగన్ కంపెనీలలో పెట్టుబడి పెట్టిన ఘనత వైయస్సార్ అని తెలంగాణలో మీ రాజన్న ఏం చేసిండని పోతిరెడ్డిపాడు నీటిని ఆంధ్రకు తీసుకెళ్లి తెలంగాణ అన్యాయం చేసి తెలంగాణలో ప్రాజెక్టులను శంకుస్థాపనలకే పరిమితం చేసి ఆంధ్రలో మాత్రం ప్రాజెక్టులు పూర్తిచేసిన మహనీయుడు అని ఆయన విమర్శించారు. తెలంగాణలో స్వరాష్ట్ర పాలనలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి నీళ్లు పారించిన ఘనత సీఎం కేసీఆర్ అని ఆయన వివరించారు. కెసిఆర్ ది రాక్షస పాలనని ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తున్న షర్మిలమ్మ మీది ఫ్యాక్షన్ ఫ్యామిలీ కాదా మీ తాత నుండి ఇప్పటివరకు ఎంతమందిని బలి తీసుకున్నారు సమాజానికి మొత్తం తెలుసన్నారు. తెలంగాణ జాతిపిత కెసిఆర్ విమర్శిస్తే తెలంగాణ సమాజం తగిన బుద్ధి చెబుతుందన్నారు. ఫార్మ్ హొజ్ లు నిర్మించుకున్నారని సీఎం కేసీఆర్ మంత్రి నిరంజన్ రెడ్డి లను విమర్శిస్తున్న షర్మిల మీ అన్న జగన్మోహన్ రెడ్డికి బెంగళూరులో హైదరాబాదులో పెద్ద పెద్ద భవనాలు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన ప్రశ్నించారు. 21 ఏళ్లు తెలంగాణ ఉద్యమం చేసి తన సొంత డబ్బులను ఖర్చు చేసిన ఘన చరిత్ర కలిగిన వ్యక్తి నిరంజన్ రెడ్డి అని వనపర్తి ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ప్రాంత అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తూ జిల్లాను శశి సాధన చేసిన చరిత్ర సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దేనని ఆయన వివరించారు. అక్రమంగా నిర్మించుకున్న దోపిడి వ్యవస్థను కాపాడేందుకే తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నారని తెలంగాణకు అడ్డుపడడం అన్యాయం చేయమని అలంపూర్లో ప్రమాణం చేసిన మీరు ఆంధ్రాలో ప్రచారం చేస్తున్నప్పుడు ఏం చెబుతున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారని ఆయన తెలిపారు. మంత్రి నిరంజన్ రెడ్డి పై చేసిన వాక్యాలను అదే ప్రజలందరూ ముందర బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన సూచించారు.
Attachments area