షర్మిల ‘ జైతెలంగాణ ‘ అనాలి’ : బాల్క సుమన్
మహబూబ్‌నగర్: పాలమూరులో తెలంగాణ వాదులపై వైఎస్సార్‌సీపీ గుండాలు చేసిన దాడిని టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం తీవ్రంగా ఖండించింది, తెలంగాణ వాదులపై వైఎస్సార్‌సీపీ గుండాలు చేసిన దాడిని తెలంగాణ వాదంపై జరిగిన దాడిగా భావిస్తున్నామని, ఈదాడితో షర్మిల తెలంగాణకు వ్యతిరేకమని తేలిపోయిందని టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు. జగన్ వదిలిన బాణం షర్మిల తెలంగాణలో పర్యటించాలంటే ‘ జైతెలంగాణ ‘ అనాల్సిందేనని ఆయన డిమాండ్ వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ తెలంగాణకు అనేకూలమని చెప్పాలని ఆరోపించారు.