షికారుకు వెళ్లి చిక్కుల్లో  పడ్డాడు ఓ యువకుడుషికారుకు వెళ్లి చిక్కుల్లో  పడ్డాడు ఓ యువకుడు రామారెడ్డి

 

 

 

 

 

షికారుకు వెళ్లి చిక్కుల్లో  పడ్డాడు ఓ యువకుడు అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. షికారుకు వెళ్లి గుహలో చిక్కుకున్న యువకుడిని బయటకు తేవడానికి అధికారుల సహాయక చర్యలు చపట్టినట్లు తెలిపారు.  రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామానికి చెందిన షాడ  రాజు  కుందేళ్లు, ఏదులను అడవి జంతువులను   షికారు చేయడానికి సింగరాయి పల్లి గ్రామ శివారులో  మంగళవారం అటవీ ప్రాంతానికి వెళ్లి రాళ్ళ  గుహలో చిక్కుకున్న విషయం అందరికీ  తెలిసిందే. గతంలో అనేక మంది  ఆ గుహ ప్రాంతానికి షికారుకు వెళ్తుంటారని ప్రజలు అంటున్నారు.  అ గుహలోకివెళ్ళడానికి  పెద్ద పెద్ద బండ రాళ్లపై నుంచి చిన్న దారి ఉండేదని , ఆ దారి గుండా లోపలికి వెళ్ళి వారికి  కావాల్సిన వాటిని వేటాడిబయటకు వస్తారని  గ్రామస్తులు ఇటివల అంటున్నారు.  గతంలో రాజు ఈ గుహలోకి వెళ్లివచ్చినట్టుగా ప్రచారం వినిపిస్తోంది. ప్రతిసారిక్షేమంగానే బయటకు వచ్చిన రాజు మంగళవారం మాత్రం బయటకు రాలేకపోయాడు.ఇంటికి చేరుకోలేదు. కుటుంబ సభ్యులు ఎదుచూశారు. ఎంతటికీ తీరిగిరాలేదు . కుటుంబ సభ్యులు షాడ రాజు ఇరుక్కున్న ప్రాంతంలో వెతకసాగారు. పై  గుహలో నుంచి  బయటకు అరుపులు కేకలు వినుపుస్తున్నాయి. ఇట్టి విషయం బయటకు పొక్కింది . సంబందీత అధికారులకు సమాచారం అందించగా అక్కడికి  పోలీసులు, అటవీశాఖ సిబ్బంది వెళ్లి సహాయక చర్య లు ముమ్మరంగా చేపట్టారు. మధ్యలో చేయి ఇరుక్కుపోయి రాజు గుహలో చిక్కుకుపోయాడని తెలుస్తోంది. రాజుతో పాటు మరొక వ్యక్తి కూడా షికారుకు వెళ్లాడని ప్రచారం సాగుతున్నా అందులో నిజమెంత అనేది తెలియరాలేదు. ఒకవేళ రాజుతో పాటు మరొక వ్యక్తి ఉండి ఉంటే  రాజు చిక్కుకున్న విషయం ఎందుకు బయటకు చెప్పలేదనే ప్రశ్న తలెత్తుతోం ది. దాంతో రాజుతో ఇంకా ఎవరు లేరన్నది.  ప్రస్తు తానికి తెలిసిన విషయం ,  జేసిబితో రాళ్లను తొలగించే  ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.  చీకటి కావడంతో రోడ్డు సరిగా  లేనందున ఏదైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందన్నభావనతో పోలీసులు ఎవరిని  అడవి లోపలికిఅనుమతించడం లేదు. సాయంత్రం 4 గంటల నుంచి పోలీసులు చేస్తున్న చీకటి పడినా ఇంకా సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారని వివరించారు.  రాజు  వ్యక్తి గుహలో చిక్కుకుని 40 గంటలుగా నరకయాతన అనుభవిస్తున్నాడు. రాజును కాపాడేందుకు అక్కడికి చేరుకున్న రెస్క్ టీం  సిబ్బంది. రాజుకి ఆక్సిజన్ అందిస్తున్నారు.40 గంటలుగా గుహలో రాజు ప్రాణం.. కాపాడేందు కు బ్లాస్టింగ్ ప్లాన్  నరకయాతన అనుభవిస్తున్నా డు. రాజుకి ఆక్సిజన్ అందిస్తున్నారు. బారీ బండలు కావడంతో వాటిని మిషన్ సహాయంతో తొలగించడం ఇబ్బందిగా మారింది. దీంతో బండను పగలగొట్టేందుకు బ్లాస్టింగ్ చేశారు. దీంతో బండకు కింది భాగంలో ఏర్పడిన రంధ్రం నుంచి అశోక్ అనే యువకుడిని, అతనితో పాటు మరో ఇద్దరు కానిస్టేబుల్‌లను లోపలికి పంపారు.