షీలా దీక్షిత్‌పై పోటీ చేస్తా

అరవింద్‌ కేజ్రీవాల్‌
న్యూఢల్లీి, జూన్‌ 2 (జనంసాక్షి) :
ఢల్లీి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌పై పోటీ చేయనున్నట్టు ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, సామాజిక ఉద్యమకారుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. ఆదివారం నగరంలో నిర్వహించిన పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన ఈ నిర్ణయం ప్రకటించారు. త్వరలో జరుగబోయే ఢల్లీి శాసనసభ ఎన్నికల్లో షీలా దీక్షిత్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న న్యూఢల్లీి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాను పోటీకి దిగుతానని ప్రకటించారు. ఢల్లీి అసెంబ్లీ ఎన్నికల్లో 12 నియోజవర్గాల్లో పోటీకి అవకాశమున్న 44 మంది జాబితా ఆమ్‌ ఆద్మీ పార్టీ గతవారమే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ మాట్లాడుతూ, షీలా దీక్షిత్‌ ఓటమి భయంతో నియోజకవర్గాలు మార్చడం పరిపాటి అని ఈసారి ఎన్నికల్లో కూడా న్యూఢల్లీి నుంచి పోటీ చేస్తారో మరో చోటికి మారుతారో కొంతకాలం వేచిచూస్తే తెలుస్తుందన్నారు. 1998 ఎన్నికల్లో గోల్‌మార్కెట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన షీలా దీక్షిత్‌ బీజేపీ అభ్యర్థి కీర్తీ ఆజాద్‌పై ఐదు వేలకు పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొందారు. తర్వాతి ఎన్నికల్లో అక్కడ గెలిచే అవకాశాలు లేవని న్యూఢల్లీికి మారారని, ఇప్పుడు ఎటువైపు వేళ్తారనని కేజ్రీవాల్‌ ఎద్దేవా చేశారు.