సంక్రాంతి నుంచి రైతుభరోసా
` రేషన్ కార్డులపై త్వరలో సన్నబియ్యం పంపిణీ
` డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలో రైతుభరోసాపై కేబినెట్ సబ్‌కమిటీ
` అసెంబ్లీలో చర్చించి త్వరలో విధివిధానాలు ఖరారు చేస్తాం
` ఏ ప్రభుత్వమూ ఇంత తక్కువ కాలంలో రుణమాఫీ చేయలేదు
` సోనియా గాంధీ రూ. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో తెలంగాణను కేసీఆర్‌కు అందిస్తే, రూ.7 లక్షల అప్పులతో మాకు అప్పగించారు
` గత ప్రభుత్వ అప్పుకు ప్రతి నెలా రూ.6,500 కోట్లు వడ్డీ చెల్లిస్తున్నాం
` నిధుల కొరత ఉన్నా హామీలు కొనసాగిస్తున్నాం
` మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి):ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతులకు శుభవార్త చెప్పారు. ఈ ప్రభుత్వం రైతు భరోసా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా సొమ్ము జమ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.రేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. ‘మారీచుల మాయమాటల నమ్మొద్దు.. సోనియాగాంధీ గ్యారంటీగా నేను చెబుతున్నా’ అని రైతులకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో సీఎం విూడియాతో మాట్లాడారు. రైతు భరోసాపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ వేశామని, అసెంబ్లీలో చర్చించి త్వరలో విధివిధానాలు ఖరారు చేస్తామని సీఎం తెలిపారు. రూ.2లక్షల రైతు రుణమాఫీ ఎలా పూర్తి చేశామో.. రైతు భరోసా కూడా అదేవిధంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.రూ. 16 వేల కోట్ల మిగులుతో తెలంగాణను కేసీఆర్‌కు అందిస్తే, పదేళ్ల తర్వాత రూ.7 లక్షల అప్పులతో రాష్ట్రాన్ని తమకు అప్పగించారని విమర్శించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇన్నేళ్ల కాలంలో ఏ ప్రభుత్వం ఇంత తక్కువ కాలంలో రుణమాఫీ చేయలేదన్న సీఎం 2018 నుంచి 2023 వరకు ఐదేళ్లలో తీసుకున్న రుణాలన్నీ ఏకకాలంలో తీర్చినట్లు వివరించారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా రైతు ఖాతాల్లో జమచేస్తామని హావిూ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించిన విధి విధానాలపై చర్చించి, సంక్రాంతి పండగకి రైతు భరోసా అమలు చేస్తామని గ్యారంటీ ఇస్తున్నాను అని వెల్లడిరచారు. ‘’ ప్రభుత్వం ఇంత అప్పుల్లో ఉందని కేసీఆర్, హరీశ్‌రావు, ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్, అధికారులు ఎవరూ చెప్పలేదు. మే అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ఆస్తులు`అప్పులపై శ్వేతపత్రం విడుదల చేశాం. భారాస ప్రభుత్వం చేసిన అప్పులపై ప్రతి నెలా రూ.6,500 కోట్లు వడ్డీ చెల్లిస్తున్నాం. భారీగా ఉన్న అప్పు చూసి కూడా అధైర్యపడకుండా పాలన సాగిస్తున్నాం. కేసీఆర్ బకాయి పెట్టిన రూ.7,625 కోట్ల రైతు బంధు మేం అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లించాం. ఇప్పటి వరకు 25.35 లక్షల మంది రైతులకు రూ.21వేల కోట్ల రుణాలు మాఫీ చేశాం. మిగతా 9 ఏళ్లు కూడా అన్ని కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహిస్తామనే నమ్మకం కలిగింది. నెహ్రూ నుంచి నేటి వరకు రైతులకు తొలిప్రాధాన్యం ఇస్తున్నది కాంగ్రెస్‌పార్టీయే. రుణమాఫీ విషయంలో భారాస ప్రభుత్వం రైతులను పదేళ్లపాటు మోసం చేసింది’’ అని రేవంత్‌రెడ్డి విమర్శించారు.’’రూ.2 లక్షల వరకు ఉన్న అందరికీ రుణమాఫీ పూర్తయ్యింది. ఖాతాల్లో పొరపాట్ల వల్ల ఆగిపోయిన వారికి శనివారం రుణమాఫీ చేశాం. ఏమైనా మానవ తప్పిదాలతో జరగకపోతే మళ్లీ సరిదిద్దుతాం. ఖాతాల్లో తప్పులు సరిదిద్దుకుని అధికారులకు చెప్తే రుణమాఫీ పూర్తవుతుంది. రేషన్‌కార్డు లేని వారికి కూడా రుణమాఫీ చేశాం. మొదట్లో బ్యాంకు అధికారులు రుణమాఫీపై సరైన సమాచారం ఇవ్వలేదు. బ్యాంకుల్లోని మొత్తం పాతబకాయిలు కలిపి రూ.30 వేల కోట్లుగా లెక్క చెప్పారన్నారు.