సంక్షేమ గురుకుల విద్యాలయ విద్యార్థినీలతో జిల్లా మంత్రి వీడియోకాన్ఫరెన్స్
సాంఘీకసంక్షేమశాఖ రాజీవ్ విద్యామిషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సంక్షేమ గురుకుల విద్యాలయ విద్యార్థినీలతో జిల్లా మంత్రి శ్రీధర్‌బాబు మరియు జిల్లా కలెక్టర్ స్మితాసబర్వాల్ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థుల యోగక్షేమాలు, వసతుల గూర్చి విద్యా బోధన గూర్చి వారిని అడిగి తెలుసు కొవడం కోసం నూతనంగా 66వ స్వాతంత్య్ర దినోత్సవం సంధర్భంగా కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సాంఘీక సంక్షేమశాఖ శకటాలపై ఉన్న విద్యార్థులతో వీడియోకాన్పరెన్స్ నిర్వహించి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని గురుకుల విద్యాలయాల్లో వీడియో కాన్ఫరెన్స్ వసతులను ఏర్పాటు చేశామని వీటి ద్వారా ఎప్పటికప్పుడు విద్యార్థులు మరియు అధ్యాపకుల గూర్చి పలు సమస్యలు విషయాలు తెలుసుకొవటం సులభతరం అవుతుందని అన్నారు. జిల్లా కలెక్టర్ స్మితాసబర్వాల్్, జిల్లా ఎస్పీ డా|| రవీందర్ విద్యార్థుల వీడియో కాన్ఫరెన్స్ తిలకించినారు.