సంక్షేమ పథకాలకు ప్రజల బ్రహ్మరథం
అందుకే పార్టీలో జోరుగా చేరికలు: వినయ్ భాస్కర్
వరంగల్,నవంబర్1(జనంసాక్షి): దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన పాక్షిక మేనిఫెస్టోను చూసి ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి పెద్దసంఖ్యలో టీఆర్‌ఎస్ లో చేరుతున్నారని వరంగల్ పశ్చిమ టీఆర్‌ఎస్ అభ్యర్థి వినయ్ భాస్కర్ చెప్పారు. హన్మకొండలోని టీఆర్‌ఎస్ అర్బన్ కార్యాలయంలో 150 మంది ప్రైవేట్ కాలేజీల అధ్యాపకులు టీఆర్‌ఎస్ లో చేరారు. వినయ్ భాస్కర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌తో ఏ పార్టీ పోటీ పడే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికే రెండు దశల ప్రచారం ముగిసిందని, ప్రజా ఆశీర్వాద పాదయాత్రకు అపూర్వ స్పందన లభించిందని వివరించారు. టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని, మెజారిటీ కోసమే ప్రచారం చేస్తున్నామని పేర్కొన్నారు.వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఓటర్లు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తామంటూ హావిూ ఇస్తున్నారని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు, దాస్యం వినయ్‌భాస్కర్ నియోజకవర్గంలో చేసిన పనులను వివరించి ఓట్లు అభ్యర్థించారు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.