సంక్షేమ పథకాలు పక్కాగా అమలు కావాలి

నిర్మల్‌,డిసెంబర్‌4(జ‌నంసాక్షి): సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు జరిగేలా కృషి చేయాలని అధికారులకు జడ్పీసీవో, ఇన్‌చార్జి డీపీవో జితేందర్‌రెడ్డి సూచించారు. గ్రామదర్శినిలో భాగంగా పంచాయతీలని సందర్శించారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని,స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. కేంద్రంలో పిల్లలు, బాలింతలు, గర్భిణులకు పౌష్ఠికాహారం అందిస్తున్న వివరాలు తెలుసుకున్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరు అధికారులను అడిగి తెలుసుకున్నారు. వైద్యం, విద్య, పారిశుధ్యం, క్లోరినేషన్‌పై శ్రద్ధ పెట్టాలన్నారు. యువత స్వయం ఉపాధివైపు మొగ్గు చూపాలని సూచించారు. గిరిజన రైతులు వ్యవసాయరంగంపై ఆధారపడి ఉంటున్నారని లిఫ్టి ఇరిగేషన్‌ కింద కెనాల్‌ నిర్మించాలని, విద్యుత్‌ సమస్యను పరిష్కారించాలని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ఈ విషయం కలెక్టరుకు నివేదిస్తామన్నారు.