సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా చూడాలి

జనగామ,జూలై25(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులుకూడా తమ గ్రామాల్లో ఈ పథకానలు చేరవేయాలన్నారు. ప్రలజ వద్దకు వెళ్లి అందుతున్న పథకాలపై ఆరా తీయాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశించిన మేరకు సంక్షేమ పథకాలను అర్హులకు అందించాలని, లబ్దిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత పాటించాలని సూచించారు. అంకితభావం, సమన్వయంతో పని చేసి ప్రభుత్వానికి పేరుప్రతిష్టలు తీసుకురావాలని, అప్పుడే అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయన్నారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.  సంక్షేమ పథకాలు, కార్పొరేషన్‌ రుణాల  దరఖాస్తు చేసుకోవాలనే అంశాలపై సంబంధిత అధికారులు పెద్దఎత్తున ప్రచారం చేయాలని ఆదేశించారు. వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడంతోపాటు పూర్తిస్థాయిలో రక్షణ, వసతి సౌకర్యం కల్పించినప్పుడే ఆశించిన మేరకు విద్యార్థులు వసతి పొందుతారని వివరించారు.