సంగారెడ్డి చేరుకున్న ముఖ్యమంత్రి
సంగారెడ్డి: సంగారెడ్డిలో అగ్ని ప్రమాదం కార్యక్రమాన్ని ప్రారంభించడానికి హైదరాబాద్ నుంచి బయల్దేరిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సంగారెడ్డిలో ఘనస్వాగతం లభించింది. ముఖ్యమంత్రి ప్రయాణించిన ప్రత్యేక హెలికాప్టర్ కంది పరిధిలోని ఐఐటి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద దిగింది. మంత్రులు సుదర్శన్ రెడ్డి, గీతారెడ్డి, సునీత రెడ్డి సీఎంకు స్వాగతం పలికారు. అక్కడ్నుంచి ఆయన నేరుగా సభ జరగనున్న అంబేద్కర్ మైదానానికి ప్రయాణమయ్యారు.