* సంఘవిద్రోహశక్తులకి సహకారం చేయొద్దు.
సీఐ పులి వెంకట్ గౌడ్ .
చిట్యాల సెప్టెంబర్22( జనంసాక్షి) సంఘ విద్రోహ శక్తులకు సహకారం చేయవద్దని సిఐ పులి వెంకట్ గౌడ్ అన్నారు. గురువారం మండలంలోని వెంచరామి గ్రామంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ పులి వెంకట్, చిట్యాల సబ్ ఇన్స్పెక్టర్ గుర్రం కృష్ణ ప్రసాద్, టేకుమట్ల సబ్ ఇన్స్పెక్టర్ చల్ల రాజు ఆధ్వర్యంలో నాకాబంది నిర్వహించి, గ్రామ ప్రజలు ఎవరు నక్సలైట్లకి సహాయం చేయొద్దని, నక్సలైట్లు చెప్పే మాయ మాటలు నమ్మొద్దని ఎవరైనా కొత్తవారు గ్రామంలో వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని అన్నారు. అలాగే గ్రామంలోని యువత చెడు సావాసాలకు పోకుండా మంచి మంచి చదువులు చదివి ఉద్యోగాలు సంపాదించి ఊరికి గొప్పపేరు తీసుకురావాలని కోరారు.
Attachments area