సంఘసంస్కర్త …సంత్ గాడ్గే మహరాజ్…

1976 ఫిబ్రవరి 23న మహారాష్ట్రలో రజకకులంలో
జింగ్రాజీ సక్కూబాయి‌లకు జన్మించిన ఓ జాతిరత్నం
నేటి ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్చభారత్ కు
గాడ్గేబాబా చీపురుదండు ‌ఉద్యమం ఒక స్పూర్తి
మథర్ థెరిస్సాలా మెహర్ బాబాతో కలిసి
కుష్టురోగులకు స్నానంచేయించిన ఓ ప్రేమమూర్తి
దళితుల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు గురువై
కులవివక్షను, వర్ణవ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించి
పండరిపూర్‌లో ఆలయప్రవేశార్హతలేని
దళితభక్తులకోసం చొక్కమేళా పేర తొలిధర్మశాలను
వృద్ధులకు వృద్ధాశ్రమాలను నిర్మించిన సమతామూర్తి
మహాత్మ జ్యోతిరావు ఫూలే ఆశయాలతో
విద్యయే వెనకబాటుతనానికి విరుగుడని
సమసమాజానికి పునాదంటూ భక్తులవిరాళాలతో పాఠశాలలెన్నో నెలకొల్పిన గొప్ప విద్యాప్రదాత
మూగజీవులను బలివ్వడం మూఢాచారమంటూ
జంతుబలిని నిరసించి తన కీర్తనలతో మద్యపానం ధూమపానం దుర్వ్యసనాల్ని రూపుమాపిన సంఘసంస్కర్త
ఆసేతు హిమాచలం పర్యటించి…
జంతువుల సంరక్షణ…
రోగులకు తక్షణ వైద్యం…
నిరుద్యోగులకు ఉపాధి…
పేదలకు నాణ్యమైన విద్య…
దుస్తులు లేనివారికి దుస్తులు…
ఆకలితో వున్నవారికి ఆహారం…
తలదాచుకునేందుకు స్థిరనివాసం…
నిస్సహాయులకు సత్వర న్యాయం…
దాహంతో అలమటించే వారికి నీరు…
విధివంచిత యువతకు వివాహమంటూ…
గ్రామగ్రామంలో దశసూత్రాలను బోధించిన
ఆథ్యాత్మిక గురువు… సంచారం భిక్షువు
సర్వసంగపరిత్యాగి… సంత్ గాడ్గే మహారాజ్
ఆ ఆదర్శమూర్తి అడుగుల్లో అడుగులు వేద్దాం…
వారి ఆశయాల సాధనకై జీవితాలను అంకితం చేద్దాం…
రచన. పోలయ్య కవి కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్

తాజావార్తలు