సంచలనం సృష్టించిన మునియప్ప వ్యాఖ్యలు

విద్రోహం వల్లే నెల్లూరులో రైలు బోగి దగ్ధం
రైల్వే శాఖ నిర్లక్ష్యంపై సర్వత్రా నిరసనలు
హైదరాబాద్‌, ఆగస్టు 4 : ఇటీవల నెల్లూరులో జరిగిన రైలు ప్రమాదంపై కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి మునియప్ప చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆ బోగిలో ప్రమాదం పేలుడు పదార్థాల వల్లే జరిగినట్టుగా ఆయన ప్రకటించారు. దీంతో ఇంత కాలం ఈ ప్రమాదంపై జరుగుతున్న చ ర్చలు, ఊహాగానాలకు తెరపడింది. రైలు బోగిలో 75 మంది ప్రయాణిస్తుండగా, కేవలం 28 మంది మరణించారని, కాని 33 మంది చనిపోయారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. షార్ట్‌సర్క్యూట్‌ వల్లే ప్రవ ూదం జరిగినట్టుగా రైల్వే శాఖ ముందుగా ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఫోరెన్సిక్‌ నిపుణులు దీనిపై విచారించిన అనంతరం కేంద్ర ప్రభుత్వానికి రైల్వే శాఖ నివేదిక సమర్పించడంతో కేంద్ర మంత్రి ఆ విధంగా ప్రకటించి ఉంటారు. దీంతో రైల్వే భద్రతపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. రైల్‌లో పేలుడు పదార్థాలు, కిరోసిన్‌, పెట్రోల్‌ వంటివి తీసుకువెళ్లొద్దని, సిగరేట్లు తాగవద్దంటూ బోర్డులు పెడుతున్నా వీటిని నివారించడంలో రైల్వే శాఖ మాత్రం విఫలమవుతోంది. ప్రతి రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కె, దిగే ప్రయాణికులను పరిశీలించేందుకు భద్రతా సిబ్బంది ఉండాలి. ఇది నిబంధన. కాని ఆ దాఖలాలు మాత్రం ప్రధాన రైల్వేస్టేషన్లలో మినహా మరెక్కడా కనిపించడంలేదు. ఈ మధ్యే రైలు ఆపి దోపిడీ దొంగలు స్వైరవిహారం చేసి ప్రయాణికుల వద్ద బంగారు, నగదు, దోచుకున్నా కనీసం ఆ దోపిడీ దొంగలను అడ్డుకునేందుకు భద్రతా సిబ్బంది రైలులో లేకపోవడం గమనార్హం. ఈ విధంగా చూసుకుంటూపోతే రైల్వేల్లో ప్రయాణికులకు భద్రతే కరువైంది. ఇప్పటికైనా రైల్వే శాఖ తగిన ఏర్పాట్లు చేసి, సిబ్బందిని నియమించి రైల్వే ప్రమాదాలను నివారించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని, ప్రజలు రైల్వే శాఖను కోరుతున్నారు.a