సంచార వాహనంను ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు
మంథని/కాటారం జూలై 30 (జనంసాక్షి) : కాటారం మండలం లోని ఇండియన్ అయిల్ కార్పొరేషన్ సంస్థ గ్రామీణ ప్రాంత ప్రజా నీకానికి వైద్య సేవలు అందించడానికి సంచార ఆరోగ్య సేవా వాహనాన్ని సోమవారం పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధ ర్‌బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతు కిసాన్ సేవా కేంద్రాల ద్వారా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సౌజ న్యంతో కాటారం, మల్హర్ మండల ప్రజలకు వైద్య సేవలు అందిం చాలనే సంకల్పంతోనే ఈ కార్యక్రమం చేపట్టారని ఆయన అన్నా రు. జిల్లాకు నాలుగు వాహనాలు కేటాయించగా మంథని డివిజన్ లోని కాటారం, మల్హర్ మండలాల్లో వాహనాలు ప్రజలకు సేవలు అందిస్తాయని, ప్రజలకు సేవలందిస్తున్న ఈ వాహనాల్లో డాక్టర్, ఫార్మసిస్ట్, విలేజి మోబైల్‌లైజర్ ఉంటారని ఆయన తెలిపారు. ప్రతిరోజు ఈ వాహనం రెండు మూడు గ్రామాలు పర్యటిస్తుందని మండలంలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవా లని ఆయన అన్నారు. డివిజన్‌లో మారుమూల ప్రాంతాలైన కాటా రం, మల్హర్‌తో పాటు మహదేవపూర్, మహాముత్తారం మండలాల్ల కు ఈ సేవలు అందించాలని ఆయన కోరారు. కరీంనగర్‌లో స్థాపించిన ఎల్‌పీజీ బాట్లింగ్ ఫ్లాంట్ కోసం కమాన్‌పూర్ మండలం లోని కన్నాల గ్రామాన్ని ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. ఈ గ్రామం గోదావరిఖని మార్గంలో రైల్వేలైన్ సదుపాయంతో పాటు అదిలాబాద్ జిల్లాకు అనుకూలంగా ఉంటుందని అన్నారు. అనంతరం పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వివేక్ మాట్లాడుతు కార్పొరేట్ సోషల్ రైఫ్ పాన్సీబులిట్‌తో చెపట్టిన ఈ కార్యక్రమం ఎంతో అభినందనీయమని ఇలాంటి వైద్య సదుపాయలతో గ్రామంలో తీవ్రమైన సమస్యలు తీరుతాయని ఆయన అన్నారు. అలాగే ఇండియన్ ఆయిల్ సంస్థ ఇడి, ఏపీఎస్‌వో నజీరుద్దిన్ మాట్లాడుతు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రభుత్వ కంపెనీల్లో అతిపెద్ద కంపెనీ అని ఈ కంపెనీకి 1683 పెట్రోల్ పంపులు అందులో 335 కిసాన్ సేవా కేంద్రాలు, 520 ఎల్‌పీజీ డిస్టి బ్యూటర్లను కలిగి ఉన్నదని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 104, 108 వాహన సేవలు అందని గ్రామాల్లో వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 40 సంచార వైద్య సేవ వాహనాలను 20 కోట్ల వ్యయంతో రూపోందించమని అందులో కరీంనగర్ జిల్లాకు సేవలు అందించడానికి నాలుగు వాహనాలను ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఐవోఎల్ చీఫ్ హెచ్‌ఆర్ మేనేజర్ ఎన్‌ఎస్ మూర్తి, వరంగల్ ఎస్‌డిఆర్ ఎస్‌ఎన్ అజిత్‌నాయర్, ఆర్డీవో ఆయోషాఖాన్, ఐవోఎల్ ప్రతినిధులు పాల్గొన్నారు.