సంతృప్తినిచ్చిన ఆరునెలల పదవీకాలం

డిజిపి మాలకొండయ్యకు ఘనంగా వీడ్కోలు

అమరావతి,జూన్‌30(జ‌నం సాక్షి): తనహయాంలో గత ఆరునెలలుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించడం, రహదారి ప్రమాదాలు తగ్గించడం వంటి చర్యలు వ్యక్తిగతంగా తనకు సంతృప్తిని ఇచ్చాయని మాజీ డిజిపి మాలకొండయ్యా అన్నారు. ఏపీ రాష్ట్ర డీజీపీ మాలకొండయ్య వీడ్కోలు పరేడ్‌ ఘనంగా నిర్వహించారు. గుంటూరు జిల్లా మంగళగిరి 6వ బెటాలియన్‌లోని కవాతు మైదానంలో ఏర్పాటు చేసిన పరేడ్‌లో 8 బెటాలియన్‌ల సిబ్బంది పాల్గొన్నారు. వీరి నుంచి మాలకొండయ్య గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ ఆరు నెలలో కాలంలో తన విధి నిర్వహణ సంతృప్తిగా ఉందన్నారు. విధి నిర్వహణలో మెరుగైన సేవలందించేందుకు సీనియర్ల సలహాలు, సూచనలు తీసుకోవాలని.. అప్పుడే విజయం సాధించగలుగుతామన్నారు. సాంబశివరావు నుంచి డీజీపీగా బాధ్యతలు తుసుకున్న సమయంలో ఆయన ఇచ్చిన సలహాలు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు. గతంతో పోల్చితే రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం, వైట్‌ కాలర్‌ నేరాలు తగ్గాయని చెప్పారు. ప్రస్తుతం సిబ్బంది పెరిగిన నేపథ్యంలో ప్రజలకు మరింత సేవ చేయాలని సూచించారు. నేరాల అదుపు విషయంలో డీజీపీ మాలకొండయ్య చక్కగా విధులు నిర్వహించారని విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ గౌతం సవాంగ్‌ కొనియాడారు. ¬మ్‌ గార్డు నుంచి ఉన్నతాధికారుల వరకు మాలకొండయ్య ఆదర్శంగా నిలిచారని ఏసీబీ

డీజీ ఆర్పీ ఠాకూర్‌ చెప్పారు.