సంస్కార భారతి ఆధ్వర్యంలో దేశభక్తి ప్రతిభా పోటీలు

ఆగస్ట్ 4, 5వ తేదీలలో నిర్వహణ
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):75వ స్వాతంత్ర్య దినోత్సవం ఆజాద్ కా అమృత్  మహోత్సవంలో భాగంగా వచ్చే నెల 4 , 5వ తేదీలలో జిల్లా స్ధాయి దేశభక్తి  ప్రతిభా పోటీలను సంస్కార భారతి ఆధ్వర్యంలో స్థానిక స్పందన డిగ్రీ కాలేజీలో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘ జిల్లా అధ్యక్షులు తోట శ్యామ్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి నాగవెళ్లి ప్రభాకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ పోటీలలో భాగంగా పాటలు , చిత్రలేఖనం, వకృత్వ , క్విజ్ , వేషదారణ వంటి పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.పోటీలలో పాల్గొనే విద్యార్థుల పేర్లను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పంపించాలని అన్నారు.ఇతర వివరాలకు 9848749022 సెల్ నెంబర్ లో సంప్రదించాలని  తెలిపారు.