సకల కళలకు, సృజనాత్మకతకు భగవాన్ విశ్వకర్మ అదిదేవుడు.

జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్17(జనంసాక్షి):
సకల కళలకు, సృజనాత్మకతకు అధినేత, మానవ మనుగడకు అవసరమైన రకరకాల వృత్తులకు ఆద్యుడు, నాగరికతకు మూలపురుషుడు భగవాన్ విశ్వకర్మ అని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్ అన్నారు.శనివారం ఉదయం శ్రీ భగవాన్ విశ్వకర్మ జయంతి సందర్భంగా నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ఆవరణలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….విశ్వకర్మ దైవిక వాస్తుశిల్పి అయిన విశ్వకర్మ పుట్టినరోజున  రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించా లని ఆదేశించిన సందర్భంగా విశ్వకర్మ జయంతిని పండుగ వాతావరణంలో నిర్వహించడం జరుగుతుందన్నారు.  ప్రతి సంవత్సరం సెప్టెంబరు 17న విశ్వకర్మ జయంతిని బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహిస్తామన్నారు. హిందూ పురాణాల ప్రకారం విశ్వకర్మ స్వయంభుగా, ప్రపంచ సృష్టికర్తగా పరిగణించబడ్డాడని,
జిల్లా విశ్వకర్మల అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ, సకల వృత్తి కళాకారులకు విశ్వకర్మ భగవానుని అనుగ్రహంతో శుభం కలగాలని ఆయన కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ సీతారాం, సహాయ బీసీ వెల్ఫేర్ అధికారి శ్రీధర్ జి, ఫోటోగ్రాఫర్ కపిలవాయి రాజు, టీ న్యూస్ శేఖరా చారి, విశ్వకర్మ సంఘాల ప్రతినిధులు, నాయకులు ధర్మాచారి, జయప్రకాశ్ చారి, మాణిక్య చారి, కేశవాచారి చంద్రశేఖర ఆచారి, గోపాల్ ఆచారి, అశోక చారి అరవింద చారి, రవీంద్రాచారి శేఖర్ చారి, రమాంచారి పాండు చారి, విష్ణు చారి, రజిత మూర్తి విష్ణు చారి, చంద్రశేఖర్ చారి, సంగోజి ప్రసాద్ చారి, కపిలవాయి జగదీశ్వర చారి తదితరులు పాల్గొన్నారు.
Attachments area