సకాలంలోపంట రుణాలు చెల్లించి- వడ్డీ రాయితీని పొందండి.

ఏపీజీవీబీ మేనేజర్ హరీష్.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్17(జనంసాక్షి):
నాగర్ కర్నూల్ మండల పరిధిలోని శ్రీపురం గ్రామంలో శనివారం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఆధ్వర్యంలో పంట రుణాలు, మరియు ఇతర రుణాలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఏపిజివిబి నాగర్ కర్నూల్ బ్రాంచ్ మేనేజర్ హరీష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రైతులంద రు పంట రుణాలను సకాలంలో చెల్లించాల ని కోరారు.రైతులు సకాలంలో రుణాలు చెల్లిస్తే, ప్రభుత్వం వారు అందించే వడ్డీ రాయితీ కి అర్హులు అవుతారని తెలిపారు. అలాగే పంట రుణాలను సకాలంలో చెల్లించని వారికి వడ్డీ భారం అధిక మవు తుందని ఆయన తెలిపారు.అవే కాకుండా బ్యాంకులో అందించే వివిధ రకాల రుణ సదుపాయాల గురించి, డిజిటల్ సేవల గురించి, ఏటీఎం సదుపాయాల గురించి తెలపడం జరిగింది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరు రుణ సదుపాయాలను సద్వినియో గం చేసుకోవాలని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ హరీష్ తో  పాటు  ఫీల్డ్ ఆఫీసర్ అయ్యప్ప, జితేంద్ర, మరియు బ్యాంకు మిత్ర ఆంజనేయులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.