సక్రమంగా రైతుబీమా వివరాల సేకరణ
ఆదిలాబాద్,జూలై7(జనం సాక్షి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు బీమా పథకం పక్రియను ఈనెల 15లోగా పూర్తి చేయాలని కలెక్టర్ దివ్యదేవరాజన్ అధికారులను ఆదేశించారు.వ్యవసాయ అధికారులతో రైతు బంధు ఇన్సూరెన్స్, రైతు బంధు చెక్కుల అప్‌లోడ్, ఎల్‌ఐసీ నమోదు, గులాబీ పురుగు నివారణోపాయాలకు చేపట్టాల్సిన చర్యలపై ,చర్చించారు. రైతు బంధు చెక్కులు, ఆర్‌వోఎఫ్‌ఆర్ చెక్కుల వివరాలు, పంపిణీ చేసినవి, మిగిలి ఉన్న వాటివి వివరాలను అప్‌లోడ్ చేయాలని అన్నారు. రుణం రెన్యూవల్ చేయని రైతులకు బీమా కల్పించేందుకు విూ సేవా కేంద్రం నుంచి చేయించాలన్నారు. నాన్ లోడింగ్ ఫార్మర్స్, కౌలు రైతులకు బీమా చేయించాలని సూచించారు. వాతావరణ ఆధారిత బీమాపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. 2015 ఏళ్లలో వచ్చిన పరిహారం వివరాలను రైతులకు వివరించాలని సూచించారు.