సచివాలయంలో ఆంక్షలు లేవు

2

నియంత్రణ మాత్రమే ఉంటుంది

లోతుగా మాట్లాడేందుకు సుముఖంగా లేను

3 శుభవార్తలు వింటారు

అల్లం నారాయణ

హైదరాబాద్‌,ఫిబ్రవరి23(జనంసాక్షి): తెలంగాణ సచివాలయంలో విూడియాపై ఆంక్షల విషయంపై  ఎలాంటి జీవో లేదని ప్రెస్‌ అకాడవిూ చైర్మన్‌ అల్లం నారాయణ అన్నారు. అయితే రీజనబుల్‌ రెగ్యులేషన్‌ ఉంటుందన్నారు. పాత్రికేయులకు వంద కోట్ల కార్పస్‌ ఫండ్‌ నెలకొల్పుతున్నట్లు తెలిపారు. అక్రిడేషన్‌ కార్డుల కోసం కమిటీ ఏర్పాటుచేశామని, అది వారం రోజుల్లో నివేదిక ఇస్తుందని అల్లం నారాయణ తెలిపారు. ఇక శనివారం జరిగిన సమావేశంలో సిఎం తీసుకున్న నిర్ణయాలపై జీవోలు విడుదల అయ్యాయని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమ నిధికి రూ.10కోట్లను విడుదల చేస్తూ తయారైన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు సోమవారం సంతకం చేశారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్‌ కమిటీ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులపై కూడా ముఖ్యమంత్రి సంతకం చేశారు. ప్రెస్‌ అకాడవిూ చైర్మన్‌ అల్లం నారాయణతో శనివారం నాడు జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై సవిూక్షించారు. 2014-15 బడ్జెట్‌లో రూ.10కోట్లు ఇవ్వడంతో పాటు 2015-16 బడ్జెట్‌లో కూడా రూ. 10కోట్లు కేటాయించాలని కేసిఆర్‌ నిర్ణయించారు. ఈ డబ్బులను ప్రెస్‌ అకాడవిూ ఖాతాలో జమ చేయాలని, బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి వడ్డీగా వచ్చిన డబ్బులతో జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్‌ కార్డుల, హెల్త్‌కార్డులు మంజూరు కోసం మార్గదర్శకాలు తయారు చేయడానికి అక్రిడిటేషన్‌ కమిటీని కూడా ప్రభుత్వం నయమించింది. సమాచార శాఖ కమిషనర్‌ మెంబర్‌ కన్వీనర్‌గా ఉండే కమిటీలో రామచంద్రమూర్తి, కట్టా శేఖర్‌ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, శైలేష్‌రెడ్డి, వెంకటకృష్ణ, క్రాంతి, గౌరి శంకర్‌, జహీరుద్దీన్‌ ఆలీ ఖాన్‌, ఆవుల సరిత, వనజ సభ్యులుగా ఉంటారు.