సత్తా చాటిన ఛాలెంజర్స్‌

–  పూణే పై 17 పరుగుల తేడాతో విజయం

–  ఉతప్పా పోరు వృథా

పుణె మే 2 (జనంసాక్షి) :

పుణెలో గురువారం రాత్రి జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో పుణెవారియర్స్‌పై రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాయల్‌ ఛాలెంజర్స్‌ జట్టు నిర్ణీత ఓవర్లలో 187 పరుగులు చేసింది. ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌ తివారి నిలకడగా ఆడి 45 బంతుల్లో 52 పరుగులు (2 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేశాడు. దిండా బౌలింగ్‌లో షాట్‌ కొట్టబోయి శర్మకు క్యాచ్‌ ఇచ్చాడు. గేల్‌ 21 బంతుల్లో 21 పరుగులు చేసి సుమన్‌ బౌలింగ్‌లో కుమార్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్‌ కొహ్లీ 18 బంతుల్లో 25 పరుగులు చేసి దిండా బౌలింగ్‌లో ఔటయ్యాడు. డివిల్లర్స్‌ (నాటౌట్‌) వచ్చీ రావడంతోనే రెచ్చిపోయాడు . 23 బంతుల్లో 53 పరుగులు (6 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేశాడు. హెన్రీక్యూస్‌ 13 బంతుల్లో 27 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పుణె జట్టులో సుమన్‌ 1, దిండా 2 రెండు వికెట్లు తీశారు. 188 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన పుణె వారియర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 170 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌ ఉతప్ప భారీ షాట్లతో అలరించాడు. 45 బంతుల్లో 75 పరుగులు (5 ఫోర్లు, 5 సిక్స్‌లు) చేశాడు. కార్తీక్‌ బౌలింగ్‌లో సింగ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఫించ్‌ 11 బంతుల్లో 15 పరుగులు చేసి హెన్రిక్యూస్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. సుమన్‌ 11, యువరాజ్‌ సింగ్‌ 16, స్మిత్‌ 4, మాథ్యుస్‌ 32, నాయర్‌ 2, కుమార్‌ 2, మెండిస్‌ 2, దిండా (నాటౌట్‌) 6,  రోహిత్‌ (నాటౌట్‌) 0 పరుగులు చేశాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ జట్టులో వినయ్‌కుమార్‌ 3, కార్తీక్‌ 2, ఆర్పీసింగ్‌, హెన్రిక్‌ తలో వికెట్‌ తీశారు.