సత్వరమే ప్రజల సమస్యలు పరిష్కరిస్తాం…
జిల్లా కలెక్టర్ సి హెచ్ శివ లింగయ్య….
జనగామ కలెక్టరేట్ జూలై18 (జనం సాక్షి):ప్రజలు అందజేసిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి న్యాయం చేకూరుస్తామని జిల్లా కలెక్టర్ శివలింగయ్య తెలిపారు. సోమవారం గ్రీవెన్స్ డే పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పలు విజ్ఞప్తులు స్వీకరించారు.
జనగామ మండలం పసరమడ్ల లో 248 సర్వే నెంబర్ లో 4 ఎకరాల 20 గుంటల భూమి ఉందని, పాస్ బుక్ ఇప్పించాలని కలెక్టర్ కు రైతు విజ్ఞప్తి చేశారన్నారు.లింగాల గణపురం మండలం బండ్ల గూడెం విద్యుత్ శాఖ లైన్మెన్ కింద పనిచేస్తున్న హెల్పర్ కొత్తపల్లిలో జాగిళ్ళపురం రమేష్ విధి నిర్వహణలో విద్యుత్ శాఖకు గురై కాళ్లు చేతులు పడిపోయాయని తమ కుటుంబాన్ని ఆదుకోవాలని తల్లి యశోద విజ్ఞప్తి చేశారని తెలిపారు.పాలకుర్తి మండలం మాదారం కు చెందిన గోపగాని రామక్క దరఖాస్తుల అందిస్తూ ఉమ్మడి ఆస్తిని న్యాయపరంగా పంపకాలు చేయడం లేదని తగు చర్యలు తీసుకోవాలని బాధిత మహిళ విజ్ఞప్తి చేశారాన్నారు.కొడకండ్ల మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన జీడి చంద్రకళ తను సంవత్సర కాలంగా కరువు పనులు చేస్తున్న డబ్బులు రావడం లేదని అందువలన పని మానేశానని కుటుంబం గడవడం కష్టం అవుతున్నదని తగు న్యాయం చేయ్యాలని కోరారని తెలిపారు. చిలుపూరు మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన సులోచన పుర మాని కుటుంబ పరంగా అనుభవిస్తున్న ఆస్తిని న్యాయ పరంగా పంచడం లేదని చర్యలు తీసుకోవాలని కోరారని అన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలన చేసి సంబంధిత అధికారులకు పంపి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు భాస్కరరావు, అబ్దుల్ హమీద్, జడ్పీ సీఈవో విజయలక్ష్మి, ఆర్డిఓ మధుమోహన్,డిఆర్డిఏ పిడి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.