సబ్బండ జాతుల పోరాట ఫలితమే… హైదరాబాద్ సంస్థానం విలీనం…

-గద్వాల జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ జెండా ఊపి ప్రారంభించిన…..
-జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ…
-ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి…
గద్వాల ప్రతినిధి సెప్టెంబరు 16 (జనంసాక్షి):-  రజాకార్ల పాలన నుండి స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం అయినందున ఈ రోజు నుంచి మూడు రోజులపాటు జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య  అన్నారు.
 శుక్రవారం జాతీయ సమైక్యత వజ్రోత్సవాల తొలిరోజు వైఎస్సార్ చౌక్ నుండి మార్కెట్ యార్డ్ వరకు భారీ సంఖ్యలో విద్యార్థులు, యువతి, యువకులు, అధికారులు, పోలీస్ శాఖ, ప్రజలు తరలిరాగా రాజీవ్ మార్గ్ నుండి  మార్కెట్ యార్డు వరకు  జాతీయ పతాకం చేతపట్టి భారత్ మాతాకీ జై, జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ వెళ్ళింది. ర్యాలీని జడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య,  జిల్లా అదనపు కలెక్టర్ శ్రీహర్ష (లోకల్ బాడీస్),గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి,  ఏఎస్పీ రాములు, వైస్ చైర్మన్ సరోజమ్మ జండా ఊపి ప్రారంభించారు.
అనంతరం మార్కెట్ యార్దులొజరిగిన బహిరంగ సభలో జడ్పీ చైర్మన్  సరితా తిరుపతయ్య మాట్లాడుతూ 1947 ఆగస్టు 15 దేశానికి స్వాతంత్రం వచ్చిన హైదరాబాద్ సంస్థానం స్వతంత్ర భారతంలో విలీనం కాలేదని ఎందరో నిజాం వ్యతిరేక పోరాట యోధులు చేసిన పోరాటాల ఫలితంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో మనకు రజాకారుల నుండి విముక్తి లభించినందున మూడు రోజులపాటు  జాతీయ సమైక్యత దినోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో మూడు రోజులపాటు జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఒక పండుగ వాతావరణం లో  నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు. ఎందరో మహనీయులు పోరాటం చేసి స్వాతంత్రం సంపాదించాక రజాకారుల నుండి విముక్తి మనకు లభించినందున సమైక్యత దినోత్సవం ఘనంగా జరుపుతున్నట్లు తెలిపారు.
ఏ ఎస్ పి రాములు నాయక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసు శాఖను బలోపేతం చేసి రాష్ట్రంలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకున్నారని అన్నారు. ఎందరో మహనీయుల త్యాగ ఫలితం వల్ల నేడు మనకు స్వాతంత్రం లభించిందని రజాకారుల నుండి విముక్తి లభించిందని అన్నారు.
అదనపు కలెక్టర్ శ్రీ హర్ష మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మూడు రోజులపాటు జాతీయ సమైక్యత సంబరాలు నిర్వహిస్తున్నందున రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. భారత దేశానికి స్వతంత్రం  వచ్చిన తర్వాత  అన్ని సంస్థానాలు విలీనం కావడానికి ఒప్పుకుంటే  జమ్మూ కాశ్మీర్, జొనా గార్డ్స్, హైదరాబాద్ మూడు మాత్రం ఒప్పు కాలేదని, హైదరాబాద్ ప్రత్యెక దేశంగా ఉండాలని, మూడు మాత్రం పోలీసు చర్యల ద్వారా  సెప్టెంబర్ 17న నిజాం రజాకారుల నుండి మనకు విముక్తి లభించిందని ఆయన తెలిపారు. అనంతరం సామూహిక జాతీయ గీతాన్ని ఆలపించారు.
తెలంగాణా రాష్ట్ర   సాంస్కృతిక సారథి కళాకారులచే   తెలంగాణా జాతీయ వజ్రో స్తావా లపై  దూమ్  ధాం కార్యక్రమాలు  ప్రజలను అలరించాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బి.ఎస్ కేశవ్ ,జాడ్ పి సి ఇ ఓ విజయ నాయక్, ఇ డి ఎస్సి కార్పోరేషన్ అధికారి రమేష్ బాబు, డి పి ఓ శ్యాం సుందర్, కన్జ్యూమర్ ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప, వైస్ చైర్మన్ సరోజమ్మ, మార్కెట్ చైర్మన్ రామేశ్వరమ్మ, గ్రంధాలయ చైర్మన్ రామన్ గౌడ్, జెడ్పిటిసిలు, ఎంపీపీలు, పిఎసిఎస్ చైర్మన్ లు, ఎంపీటీసీలు, సర్పంచులు, అన్ని శాఖల అధికారులు , విద్యార్తులు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు….