సబ్సిడీపై నూతన పశుగ్రాస విత్తనాలు

-సహాయ సంచాలకులు డాక్టర్ యు.ఆర్.రమేష్.
గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 2, (జనం సాక్షి);
సి ఎస్ హెచ్ 24 ఎం ఎఫ్ రకానికి చెందిన నూతన హైబ్రిడ్ బహువార్షిక జొన్నజాతి పశుగ్రాస విత్తనాలు 75 శాతం సబ్సిడీతో గద్వాల మండలం ప్రాంతీయ పశు వైద్యశాల లో అందుబాటులో ఉన్నాయని పశువైద్య సహాయ సంచాలకులు డాక్టర్ యు.ఆర్. రమేష్,పశువైద్య సహాయకురాలు బి.తేజస్విని ఒక ప్రకటనలో తెలిపారు.
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండల పశుపోషకులకు పాడి పశువుల రైతులకు సబ్సిడీపై గద్వాల మండల ప్రాంతీయ పశు వైద్యశాల గద్వాలలో అందుబాటులో ఉన్నాయని, కావలసిన రైతులు ఆధార కార్డు జిరాక్స్,పొలం పాస్ బుక్ జిరాక్స్ తీసుకొని రావలయునని, అధిక దిగుబడి ఇస్తున్న హైబ్రిడ్ జొన్న గ్రాసం ఎకరాకు దిగుబడి 30 టన్నులు వస్తుందని,దీనిలో అధిక పోషక విలువలు ఉండి,పశువులకు ఎంతో సులభంగా జీర్ణం అవుతాయని,అధిక పాల దిగుబడి ఇవ్వనున్నట్లు శాస్త్రవేత్తల పరిశోధనలో తేలిందని వారు తెలిపారు