సభ్యత్వ నమోదు ప్రారంభం

ఆదిలాబాద్‌: మార్చిలో జరగబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబందించి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పీఆర్టఈయూ శ్రీకారం చుట్టింది. ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు దారెట్ల జీవన్‌ ప్రారంబించారు. ఈ కార్యక్రమం నవంబర్‌ 10వరకు కొనసాగనుంది. తమ అభ్యర్థి మోహన్‌రెడ్డిని గెలిపించాలని ఉపాధాయులను కోరారు.