సమగ్ర చట్టాలు దేశానికి హితం

2

చట్టసభల్లో వీధి పోరాటాలు

ఆర్డినెన్స్‌లపై ప్రణభ్‌ కీలక వ్యాఖ్యలు

దిల్లీ,జనవరి19(జనంసాక్షి): ఆర్డినెన్స్‌ల జారీపై రాష్ట్రపతి సుతిమెత్తగా హెచ్చరిక చేశారు. ఇవి కేవలం వెసలుబాటు కోసం ఉద్దేశించినవేనని అన్నారు.   సమగ్ర చర్చలతో చట్టాలు రూపొందించే వేదిక పార్లమెంట్‌ అని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. వీధి ప్రదర్శనలు అనేవి పార్లమెంటు లక్షణం కాదని అభిప్రాయపడ్డారు. ఆర్డినెన్స్‌ అనేది తప్పినిసరి పరిస్థితుల్లో రాజ్యాంగం ఇచ్చిన పరిమిత అవకాశం. చట్టాల రూపకల్పనలో అధికార, ప్రతిపక్షాల నడుమ సవ్యదిశలో చర్చలు జరగాలన్నారు. సాధారణ చట్టాల కోసం ఆర్డినెన్స్‌ తేవడం సముచితం కాదని పేర్కొన్నారు. ఇటీవల కేంద్రం వరుస ఆర్డినెన్స్‌లు తేవడం, భూసేకరణ ఆర్డినెన్స్‌ ఆమోదం పొందడం తెలిసిందే. తప్పనిపరిస్థితుల్లో ఆర్డినెన్స్‌లు తప్పవని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు కూడా అన్నారు.