సమరభేరికి భారీ జనం
నల్లగొండ : ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్ సమరభేరి మోగించనుంది. తెలంగాణలోని పల్లెపల్లె కథనోత్సాహంతో సూర్యాపేట వైపు కథం తొక్కుతుంది. తెలంగాణ గ్రామీణ ప్రజలు టీఆర్‌ఎస్ ఉద్యమస్ఫూర్తితో సూర్యపేట వైపు అడుగులు వేస్తున్నారు. తెలంగాణలోని కవులు, కళాకారులు ఆటపాటలతో సూర్యపేటకు బయలుదేరారు. ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్ పిలుపు మేరకు సూర్యపేటలో సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించనున్న ‘సమరభేరి’ బహిరంగ సభకు భారీ జనం వస్తున్నారు. ఈ సభకు ఉదయం నుంచే టీఆర్‌ఎస్ శ్రేణులు, తెలంగాణ వాదులు, ప్రజలు తరలి వస్తున్నారు. సుమారు ఐదు లక్షల మంది ప్రజలు సమరభేరికి హాజరు అవుతారని అంచనా వేస్తున్నారు.