సమరశీల పోరాటాలు ఏఐఎస్ఎఫ్ ద్వారానే సాధ్యం

– ఏఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర నాయకులు అందె అశోక్
చేర్యాల (జనంసాక్షి) జులై 30 : విద్యారంగ సమస్యలపై సమరశీల పోరాటాలు ఏఐఎస్ఎఫ్ ద్వారానే సాధ్యమని ఏఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర నాయకులు అందె అశోక్ అన్నారు. శనివారం మండలంలోని ఆకునూరు గ్రామ జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పుల్లని వేణు అధ్యక్షతన సంఘం నూతన సభ్యత కార్యక్రమం చేపట్టగా అందె అశోక్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 1936 ఆగస్టు 12న లక్నో నగరంలోని బనారస్ యూనివర్సిటీలో ఆవిర్భవించిన ఏఐఎస్ఎఫ్ 86 సంవత్సరాల సుదీర్ఘ పోరాట చరిత్ర ఉందన్నారు. ఆనాడు దేశ స్వతంత్ర్యం కోసం పొత్తిలోనే పిడికిలి బిగించి స్వాతంత్రం నా జన్మ హక్కు అని చాటి చెప్పి భారతదేశ స్వాతంత్ర్య సాధనతో పాటు, విద్యారంగ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా శాస్త్రీయ విద్యావిధానమే లక్ష్యంగా భగత్  సింగ్, రాజ్ గురు సుఖ్ దేవ్, చంద్రశేఖర్ ఆజాద్, చేగువేరా వంటి విప్లవ వీరుల స్పూర్తితో విద్యారంగ సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న ప్రపంచంలోనే మొట్టమొదటి విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని అన్నారు. రెండవ సారి అధికారంలోకి వచ్చిన మోడి ప్రభుత్వం నూతన విద్యావిధానము 2020 తీసుకవచ్చి విద్య కేంద్రికరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వాలకు రాష్ట్రాలకు అధికారాలు, స్వయం ప్రతిపత్తిని తగ్గిస్తూ విద్యను కాషాయకరణ, వ్యాపారీకరణ చేయాలని కుట్రలు చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న అనాలోచిత విద్యారంగ వ్యతిరేక విధానాలను విద్యార్థులు ఐక్యంగా పోరాటాలు నిర్వహించి తిప్పికొట్టాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఎర్రోళ్ల అఖిల్, ఛత్రపతి,సాత్విక్, వర్షిత్, పూజ, వైష్ణవి, విద్యార్థులు పాల్గొన్నారు.