సమస్యల పరిష్కారం కోసం వినతి

ఏలూరు,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలోని ప్రజలకు కనీస సౌకర్యాలు ఇళ్ల స్థలాల సమస్య, డ్రైనేజీ, తాగు నీరు సమస్యలు పరిష్కారం చేయాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సిపిఎం ఆధ్వర్యంలో పెనుమంట్ర తహశీల్దార్‌ కార్యాలయం వద్ద మండల ప్రజలు మంగళవారం డిప్యూటీ తహశీల్దార్‌కు వినతిపత్రం అందచేశారు. 200 మందితో సిపిఎం జిల్లా నాయకులు డిప్యూటీ తహశీల్దార్‌ సాంబమూర్తికి వినతి పత్రం అందజేశారు.

 

తాజావార్తలు