సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి

శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలి

వనపర్తి జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి,

వనపర్తి బ్యూరో అక్టోబర్ 27 (జనం సాక్షి)

జిల్లాలో నవంబర్ 30న జరిగే శాసనసభ ఎన్నికల సందర్భంగా ఎలాంటి వర్గ బేధాలు లేకుండా అల్లర్లు జరుగకుండా ప్రజలంతా సహకరించాలని జిల్లా రక్షిత కె మూర్తి, విజ్ఞప్తిచేశారు.శుక్రవారం నాడు అమరచింత పట్టణం లోని బాయ్స్ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్, ఉర్దూ మీడియం స్కూల్ల ను పరిశీలించారు అదేవిధంగా ఆత్మకూర్ పట్టణంలోని హై స్కూల్ గ్రామపంచాయతీ భవనం
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి సాధించడం జరిగిందని అన్నారు. ఎవరైనా చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన, గొడవలు సృష్టించాలని చూసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని హెచ్చరించారు. గ్రామంలోని ప్రజలంతా ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడే గ్రామము, జిల్లా అభివృద్ధి చెందుతుందని ,కావున ప్రజలంతా వర్గ బేధాలు లేకుండా శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా సహకరించాలని ఒకరికి ఒకరు కలిసి మెలిసి సామరస్యంగా ఉండాలని తెలిపారు. ప్రజలంతా ఎలక్షన్ సమయంలో పోలీసు వారికి సహకరించాలని ఎస్పీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూర్ సీఐ రత్నం , ఆత్మకూర్ ఎస్సై నరేందర్ , అమరచింత ఎస్ఐ జగన్ పాల్గొన్నారు.